MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్నేహం కోసం నిలిచిన కృష్ణం రాజు.. చిరంజీవి జీవితంలో మరచిపోలేని సంఘటన

స్నేహం కోసం నిలిచిన కృష్ణం రాజు.. చిరంజీవి జీవితంలో మరచిపోలేని సంఘటన

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త టాలీవుడ్ మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణం రాజు మృతి గురించి తెలియగానే విషాదంలో మునిగిపోయారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 11 2022, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Krishnam Raju

Krishnam Raju

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త టాలీవుడ్ మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణం రాజు మృతి గురించి తెలియగానే విషాదంలో మునిగిపోయారు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణం రాజు అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం తెల్లవారుజామున మరణించారు. రెబల్ నెస్, మాస్ యాటిట్యూడ్ కి కొత్త నిర్వచనం చెబుతూ కృష్ణం రాజు సినిమాల్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అభిమానులకు రెబల్ స్టార్ గా మారిపోయారు. సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. 1998లో బీజేపీ నుంచి కృష్ణం రాజు కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా వివిధ విభాగాల్లో పనిచేశారు. 2004 ఎన్నికల్లో కృషం రాజు ఓటమి చెందారు. 

36

కృష్ణం రాజు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరిదీ మొగల్తూరే. చిరంజీవితో స్నేహానికి కృష్ణం రాజు ప్రాధాన్యత ఇచ్చారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కృష్ణం రాజు అందులో చేరారు. రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కృష్ణం రాజు తిరిగి బిజెపికి చేరువయ్యారు. 

46

అయితే చిరంజీవితో స్నేహం మాత్రం చెక్కు చెదర్లేదు. ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు చిరంజీవితో తనకున్న ఫ్రెండ్ షిప్ ని బయట పెట్టారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో.. రేడియోలో ఏ పాట వినిపించినా డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. అప్పడే చెప్పాను నీలో మంచి రిథమ్ ఉంది రా అబ్బాయ్.. చాలాఎత్తుకి ఎదుగుతావ్ అని చెప్పా. 

56

ఒకసారి చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళా. నాతో పాటు మా మేనల్లుడు కూడా వచ్చాడు. నేను లండన్ నుంచి తెప్పించిన కెమెరాతో చిరంజీవి బర్త్ డే కి వచ్చిన సెలెబ్రిటీలని ఫోటోలు తీస్తున్నాడు. చిరంజీవి ఆ కెమెరాని చూసి.. ఎక్కడ తెచ్చావ్ అన్నా ఈ కెమెరా.. నేను దీనిని లండన్ లో చూశాను. చాలా క్లాస్టీ.. అంత ఖరీదైనది ఎందుకులే అని కొనలేదు అని చెప్పాడు. వెంటనే మా మేనల్లుడి మెడలో కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసా. ఇదే నీ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పా. చిరంజీవి ఆశ్చర్యపోయాడు అని కృష్ణం రాజు అన్నారు. 

66

ఇక కృష్ణం రాజు పెదనాన్నగా ప్రభాస్ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. ప్రభాస్ కెరీర్ ఆరంభం నుంచి స్టార్ అయ్యే వరకు కృష్ణం రాజు తెర వెనుక ఉండి చూసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న అడుగు జాడల్లో యంగ్ రెబల్ స్టార్ గా, పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
భారతీయ జనతా పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved