రమ్య కృష్ణ నక్షత్రం కన్నా ఎక్కువని, ఆకాశం లాంటిదన్న కృష్ణ వంశీ నక్షత్రం సినిమా ఆడియో వేడుక సందర్భంగా కృష్ణ వంశీకి ఆసక్తికర ప్రశ్న తన నక్షత్రం తన కొడుకేనన్న కృష్ణ వంశీ, రమ్యకృష్ణ మాత్రం ఆకాశమని ప్రశంస
టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. విభిన్నమైన చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనది డిఫరెంట్ స్టయిల్. రాశి కంటే వాసి ఎక్కువగా నమ్మే కృష్ణవంశీ గత 20 ఏళ్లలో ఆయన తీసింది కేవలం 20 చిత్రాలు మాత్రమే. తాజాగా ఆయన రూపొందించిన నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తన కుమారుడు, భార్య రమ్యకృష్ణపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కృష్ణవంశీని యాంకర్ ఉదయభాను సరదాగా ప్రశ్న అడిగింది. ఎంతో మంది స్టార్స్‌తో మీరు వర్క్ చేశారు కదా?.. మీకు ఏ స్టార్ అయినా చుక్కలు చూపించారా?'' అని అడగ్గా.. చాలా మంది నటులకు నేనే చుక్కలు చూపించాను' అంటూ కృష్ణ వంశీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
‘మీ లైఫ్‌లో నక్షత్రం ఎవరు? సినిమాలో నక్షత్రం ఎవరు?' అని ఉదయభాను అడిగిన మరో ప్రశ్నకు ‘నా లైఫ్‌లో నక్షత్రం నా కొడుకు' అని కృష్ణవంశీ చెప్పారు. అయితే వేదిక మీద ఉన్నవారు రమ్యకృష్ణ పేరు ప్రస్తావించారు. దానికి కృష్ణవంశీ స్పందిస్తూ ‘రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం' అని బదులిచ్చారు. కృష్ణవంశీ సమాధానానికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వేశారు.
ఇక ఈ సినిమా విషయంలో అందరూ నక్షత్రాలే అని సెలవిచ్చారు కృష్ణవంశీ. చంద్రలేఖ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ రమ్యకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లిపీటలపైకి ఎక్కించారు. 2003 జూన్ 12న కృష్ణవంశీ, రమ్యకృష్ణ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారికి ఓ కుమారుడు కలిగాడు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
