Krishna Mukunda Murari: బుల్లితెర పై ప్రసారం అవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి ఆసక్తికరమైన కథతో కొనసాగుతుంది. అదేవిధంగా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అసలు మీరిద్దరూ భార్యాభర్తలేనా, లేకపోతే మా ముందు భార్యాభర్తల్లాగా నటిస్తున్నారా అంటూ నిలదీస్తుంది ముకుంద తల్లి. ఏ భార్యాభర్తలైన ఎక్కడికైనా వెళ్ళమంటే ఎగిరి గంతేస్తారు కానీ మీరు ఏంటి ఆవిడేమో కాలేజీ అంటుంది. నువ్వేమో ఇంకేదో చెప్పి నసుగుతున్నావు అంటుంది. అది కాదమ్మా మేము ఆదర్శ్ ని వెతకడానికి వెళ్తున్నాం కదా అని ముకుంద అంటే 24 గంటలు అదే పని మీద ఉంటారా.
మిగతా టైంలో మీ భార్యతో సరదాగా గడపొచ్చు కదా మొన్న హనీమూన్ కూడా అలాగే మిస్ చేశారు మీరు ఇప్పుడు వెళ్లి తీరాలి అంటూ ఆర్డర్ వేస్తుంది రేవతి. దగ్గరుండి కొడుకు చేత బుక్ చేయిస్తుంది. మరి ముకుందా అని మురారి అంటే తనకి దూరంగా బుక్ చేయిస్తుంది. తను ఫీల్ అవుతుందేమో అని మురారి అంటే తనకి కూడా విండో సీట్ ఇష్టము అంటే బలవంతంగా బుక్ చేయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి.
ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకు కూర్చుంటాడు మురారి. మొదటిసారి రేవతి అత్తయ్య ఎంత అడ్డుపడిన మురారిని నాతో తీసుకెళ్లగలుగుతున్నాను అనుకుంటుంది ముకుంద. ఏదేదో ఊహలకి పోతున్నట్లుగా ఉన్నావు నేనుండగా నా కొడుక్కి ఏ ప్రేమగాలి సోకనివ్వను అనుకుంటుంది రేవతి. భవాని దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది ముకుంద నువ్వు ఆదర్స్ తోనే తిరిగి రావాలి అని దీవిస్తుంది భవాని. నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ నాకు మురారే ముఖ్యం అనుకుంటుంది ముకుంద.
ఒక్కడే కిందకి దిగుతున్న మురారిని చూసి కృష్ణ రావటం లేదు ఏంటి మళ్లీ ముకుందా ఏమైనా ప్లాన్ చేసిందా అనుకుంటుంది రేవతి. క్రిష్ణగిరి ని అడిగితే వస్తుంది అంటాడు మురారి. దగ్గరుండి మాకు సెండాఫ్ ఇస్తుందేమో అనుకుంటుంది ముకుంద. అప్పుడే కిందికి వచ్చిన కృష్ణ నావల్ల లేట్ అయిందా సారీ అంటూ బయలుదేరుదామా అంటుంది. ఆ మాటకి షాక్ అవుతుంది ముకుంద. అదేంటి కృష్ణ కూడా వెళ్తుందా అని అడుగుతుంది భవాని.
ఎలాగూ కృష్ణకి లీవ్లు ఉన్నాయి ఢిల్లీ చూడలేదు అంది అందుకే మురారిని టికెట్స్ బుక్ చేయమన్నాను అంటుంది రేవతి. ఆలస్యం ఎందుకు మీరిద్దరూ బయలుదేరండి అంటుంది ముకుంద. ఎక్కడికి అని కృష్ణ అడిగితే మీరిద్దరూ హనీమూన్ కి వెళ్తున్నారు కదా మీ ఇద్దరి మధ్య నేనెందుకు అంటుంది ముకుంద. అలా ఎందుకు అనుకుంటున్నావు అని ముకుంద మామగారు అడిగితే మీకు తెలియదు రేవతి అత్తయ్య కావాలనే కృష్ణని పంపిస్తుంది అంటుంది ముకుంద.
కావాలని అంటే ఏంటి అంటుంది రేవతి. నీ కొడుకు నీ కోడల్ని హనీమూన్ కి పంపించాలని కోరిక ఇలా తీర్చుకుంటున్నారు అంటుంది ముకుంద. కృష్ణ తెలియక ఢిల్లీ చూడాలని ఉంది అందేమో ఆమాత్రానికే హనీమూన్ అని ఎందుకు అనుకుంటావు అంటుంది భవాని. ఆదర్శ తిరిగి రావాలని కృష్ణ మెయిల్ పెట్టిన దగ్గర నుంచి మనకి అన్ని అనుకూలంగానే జరుగుతున్నాయి అంటుంది భవాని. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగేది వేరు.
నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ తన కొడుకు కోడలు సుఖంగా ఉంటే చాలు వెళ్ళేది ఆదర్శ్ ని వెతకడం కోసం అని తెలిసి కూడా సైట్ సీయింగ్ కోసం కృష్ణని అప్పటికప్పుడు ప్రిపేర్ చేశారు అంటే ఎంత స్వార్ధంగా ఆలోచిస్తున్నారో అంటుంది ముకుంద. కృష్ణ వస్తే నీకేంటి నష్టం అంటుంది రేవతి. కొత్తజంట ప్రేమ యాత్రలో నేను పిచ్చిదాని లాగా ఉండాలా, వాళ్ళిద్దరూ చెట్టపట్టలేసుకొని తిరుగుతుంటే నేనేం చేయాలి అంటూ నిలదీస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ ఎంతమంది ముందు నా తోటకూడాలని విమర్శిస్తూ మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం మా అందరికీ మురారి ఎంతో ఆదర్శ్ కూడా అంతే.
ఆ బేధాలు మేము ఇప్పుడు చూపించలేదు నువ్వు వచ్చి కొత్తగా లేనిపోని అభండాలు వేయొద్దు. అయినా నిన్ను పక్కన పెట్టుకొని పెళ్ళాంతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడా ఆ మాత్రం సంస్కారం లేకుండా మేము వాడిని పెంచలేదు అంటుంది భవాని. ఇప్పుడు నువ్వు రమ్మన్నా మేము రాము అయినా ఆదర్శ్ ని నా నా పద్ధతిలో నేను వెతుకుతాను నేను నా భార్య హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటే మా మమ్మీ అరేంజ్మెంట్స్ చేసుకోమన్నప్పుడే వెళ్లేవాడిని.
మా మమ్మీ ని నా ముందే అవమానిస్తుంటే నేను భరించలేను ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు అంటాడు మురారి. నన్ను క్షమించండి ఇదంతా నా కుటుంబం అనుకున్నాను ఆదర్శ్ భార్యగా నేను ఇంట్లో ఉంటేనే గౌరవం అనుకున్నాను కానీ మీరందరూ నా ఒక్కదాన్నే వేరు చేశారు అంటూ డ్రామా ప్లే చేస్తుంది ముకుంద. నిన్న కాక మొన్న వచ్చిన కృష్ణ కూడా మీ మనిషి అయిపోయింది కానీ భర్త లేని స్త్రీ గా నాకు మీ ఇంట్లో ఏ విలువ లేదని తెలిసిపోయింది.
మీరందరూ నా వాళ్లే అనుకున్నాను అందుకు మీరు నాకు సరైన గుణపాఠం చెప్పారు. ఇకనుంచి నా హద్దుల్లో నేను ఉంటాను. ఇంత ముద్ద పెడితే తిని జీవితం లాగా పడి ఉంటాను ఆదర్శ్ వచ్చాకే తిరిగి వస్తాను. అందరూ దయచేసి ఈ ఇంట్లో తలదాచుకోవటానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది ముకుంద. జరిగిన సంఘటనతో ఇంట్లో వాళ్ళందరూ ముభావంగా ఉంటారు. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన మురారి కృష్ణ ని చూసి నవ్వుతాడు.
నువ్వు తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటావు అంటాడు మురారి. అదేంటి అంటే అవును ఏ మలినాన్ని అంటించుకోవు అంటాడు మురారి. ఇందాక జరిగిన గొడవ గురించా మీరు మాట్లాడేది ఉంటుంది కృష్ణ. మీరు చేయలేదు కదా మరి మీతో ఎందుకు కోపంగా ఉంటాను అంటుంది కృష్ణ. అందరూ నీలాగా ఉంటే ఎంత బాగుంటుంది అంటాడు మురారి. మీ ఇంట్లో అందరూ అలాగే ఉన్నారు ఒక్క ముకుంద తప్ప.
అయినా మనం హనీమూన్ ప్లాన్ చేయటం ఏంటి ఆలోచన లేదు కదా మరి ముకుందకి ఏమైనా తిక్కా అని కృష్ణ అంటే నిజమే అక్కడ అంత మంది ఉండగా మా అమ్మ మీద విరుచుకుపడింది అది పద్ధతి కాదు అంటాడు మురారి. నేను అదే అనుకున్నాను అంటే మీ మీద, అత్తయ్య మీదే ఎందుకు వీరికి పడుతుంది నాకు చాలా కోపం వచ్చింది అంటుంది కృష్ణ. ఆదర్శ్ తిరిగివస్తే అన్ని చక్కపడతాయి అంటాడు మురారి. ఈ లోపు ఆమె తిక్క ముదిరిపోతుంది అంటుంది కృష్ణ.
దానికి మనం ఏం చేస్తాం అని మురారి అంటే తనకి వంటరితనం వల్ల డిసీజ్ ఎక్కువైపోయింది తినేటప్పుడు తప్పితే తను ఎవరితో కలవడం లేదు. అందరితోనీ కలిసిపోయి ఉంటే తనకి ఈ సమస్య ఉండేది కాదు. ఆదర్శ్ లేకపోయినా ఆమెని ఇంట్లో అందరూ గౌరవంగా చూసుకుంటున్నారు అది గుర్తించాలి కదా ముకుంద అంటుంది కృష్ణ. మనం ఢిల్లీ వెళ్లకపోవడమే మంచిదయింది. ఇదే గొడవ అక్కడ జరిగి ఉంటే నువ్వు చాలా ఇబ్బంది పడే దానివి ఎక్కడ కాబట్టి మనల్ని అందరూ సపోర్ట్ చేశారు అంటాడు మురారి. ఇంకోసారి తను మిమ్మల్ని గాని నన్ను గాని ఏమైనా అంటే ఊరుకోను అంటుంది కృష్ణ.
నా ఫుల్ సపోర్ట్ నీకే అంటాడు మురారి. మీరు అన్నట్లుగా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ఉండిపోతాడు మురారి. ఎందుకు తదేకంగా నా మొహమే చూస్తున్నారు అంటుంది కృష్ణ. చెప్తే ఏమి అనుకోవు కదా నవ్వితే నీ బుగ్గలు టమాటా పండులాగా ఎర్రబడతాయి అంటాడు మురారి. ఆ మాటలకి మరింత సిగ్గు పడిపోతుంది కృష్ణ. మరోవైపు భవాని పిలవడంతో ఆమె దగ్గరికి వస్తాడు మురారి. నేను మీ ఇంట్లో ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్య అలా జరగటం లేదు.
ఈశ్వర్, ప్రసాద్, మధుకర్, అలేఖ్య అందరూ నా సంగతి అర్థం చేసుకున్నారు కానీ ఆ తింగరి పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటుంది భవాని. తరువాయి భాగంలో నా తరఫున నీకు కాంప్లిమెంట్ అంటూ డాక్టర్ డ్రెస్ స్టెతస్కోపు ఇస్తాడు మురారి. అది మెడలో వేసుకుని బాగా ఎమోషనల్ అవుతుంది కృష్ణ.
