అఫీషియల్: ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఇతడే!

krish to direct ntr biopic
Highlights

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఅర్'

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఅర్' బయోపిక్ లో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడిగా తేజ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. కానీ మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. 

దీంతో తెరపై చాలా మంది దర్శకుల పేర్లు వచ్చాయి. ఒకానొక దశలో బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు ప్రకటించారు.దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం బాలయ్య వాయిస్ తో సాగింది. 

దీనిపై స్పందించిన దర్శకుడు క్రిష్ ''నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు.ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను'' అన్నారు. జూలై నుండి ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. 

 

loader