మెగాస్టార్ తో కొరటాల శివ?

koratala siva to direct megastar chiranjeevi
Highlights

ఇప్పుడు కొరటాలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు

దర్శకుడిగా కొరటాల శివ డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. 'మిర్చి'తో మొదలైన ఆయన ప్రయాణం వరుస విజయాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 'భరత్ అనే నేను' సినిమా వంద కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఆయన తదుపరి సినిమా మెగాహీరో అల్లు అర్జున్ తో ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి కొరటాల గతంలోనే మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాల్సివుంది. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా కూడా మొదలుపెట్టారు. కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు కొరటాలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

ఇటీవల మెగాస్టార్ ను కలిసి కొరటాల ఒక లైన్ ను వినిపించినట్లు తెలుస్తోంది. ఆ లైన్ ఆసక్తికరంగా అనిపించడంతో చిరు పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం కొరటాల మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోనున్నారు. అదే సమయంలో చిరు కోసం కథను కూడా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ కథ గనుక చిరుకి నచ్చితే ఇక ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమంటున్నారు. 

loader