శ్రీరెడ్డి నాపై చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు : కోనా వెంకట్

శ్రీరెడ్డి నాపై చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు : కోనా వెంకట్

శ్రీరెడ్డి లీక్స్ పేరుతో చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి రోజు కొన్ని లీకులు పోస్టు చేస్తున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలపై రచయిత కోన వెంకట్ స్పందించారు.

ఓ నటి చేస్తున్న ఆరోపణలతో తాను షాక్‌కు గురయ్యానని కోన వెంకట్ ట్వీట్ చేశారు. తనతో సహా కొంతమందిపై ఆమె చేస్తున్న ఆరోపణలపై పోలీసులతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం కొందరు ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు నటులను తీసుకోవాలనే డిమాండ్‌ను తాను కూడా సమర్థిస్తానని, తన సినిమా ‘గీతాంజలి’లో అందరూ తెలుగువారేనన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page