దిల్ రాజు తప్ప ఇంకెవరూ విష్ చేయలేదు.. సినీ ఇండస్ట్రీపై నివేదిక కావాలి, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు

కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే.

Komatireddy venkat reddy interesting comments on tollywood dtr

కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే కోమటిరెడ్డి టాలీవుడ్ పై సంచనలన వ్యాఖ్యలు చేశారు. 

సినిమాటోగ్రఫీ మంత్రిగా భాద్యతలు తీసుకున్న తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదు. కనీసం నాకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. కేవలం దిల్ రాజు మాత్రమే తనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు కోమటిరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కోమటిరెడ్డి చిత్ర పరిశ్రమపై రివ్యూ మీటింగ్ కోసం నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకి తెలియాలని కోమటిరెడ్డి అన్నారు. 

Also Read: BiggBoss7:అమర్ దీప్ భార్యని టార్గెట్ చేసిన శివాజీ ఫ్యాన్స్..డిఫెన్స్ బాగా ఆడింది, కానీ క్లీన్ బౌల్డ్

బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ శాఖకు తలసాని మంత్రిగా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆ పదవి కోమటిరెడ్డికి దక్కింది. తలసానితో గతంలో ఇండస్ట్రీ ప్రముఖులు సన్నిహితంగా ఉండేవారు. మరి ఇప్పుడు కోమటిరెడ్డితో ఇండస్ట్రీ ప్రముఖులు ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారో చూడాలి. 

దిల్ రాజు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే ఫోన్ చేసి కోమటిరెడ్డిని విష్ చేశారట. ఇండియా రాగానే మంత్రిని కలవబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: కంప్లీట్ గా లుక్ మార్చేసిన అనసూయ.. నవ్వుతో మాయచేస్తున్న క్రేజీ యాంకర్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios