కంప్లీట్ గా లుక్ మార్చేసిన అనసూయ.. నవ్వుతో మాయచేస్తున్న క్రేజీ యాంకర్, లేటెస్ట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది.
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.
వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
అయితే అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే చీరకట్టులో సైతం అనసూయ కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాల్ని తగలబెట్టే విధంగా ఫోజులు ఇస్తోంది.
అనసూయ ధరించిన బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది. స్టైలిష్ గాఅనిపించే బ్లౌజ్ లో అనసూయ మెరుపు తీగలా హొయలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ తరహా బ్లౌజ్ లు ధరించి యువతని కట్టి పడేయాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్లీవ్ లెస్ బౌజ్ లో అనసూయ చిరునవ్వులు చిందిస్తూ ఆకర్షిస్తోంది. అంతే కాదు ఆమె హెయిర్ స్టైల్, లుక్ ఈ ఫొటోస్ లో పూర్తిగా మారిపోయింది అని చెప్పొచ్చు.
తన నార్మల్ లుక్ కి భిన్నంగా అనసూయ కొత్త లుక్ ట్రై చేసింది. అనసూయ పబ్లిక్ లో ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే అనసూయ యువతని ఆకర్షిస్తూ చిరునవ్వులతో మాయ చేస్తోంది.