నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ' సినిమా తెరకెక్కింది. సిమ్రాన్ పరింజా .. సంయుక్తా హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిఖిల్ కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.

మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 15 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎన్నో రోజులు పట్టదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయి సక్సెస్ సాద్యమైందంటూ .. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిఖిల్, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.