యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్యతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.  

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో ఆయన ఎంగేజ్‌మెంట్‌ జరగడం విశేషం. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కిరణ్‌ అబ్బవరం హీరోగా `రాజావారు రాణిగారు` చిత్రంతో పరిచయం అయ్యారు. అందులో హీరోయిన్‌ రహస్య. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. కిరణ్‌ అబ్బవరంని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా సమయంలోనే హీరోయిన్‌ రహస్యతో పరిచయం ప్రేమగా మారింది. ఇన్నాళ్లపాటు వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ చేసుకుంటూ వచ్చారు. ఇటీవలే తమ ప్రేమని ప్రకటించారు. పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. 

ఇక ఈ బుధవారం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఇక ఈ ఇద్దరు ఆగస్ట్ లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక కిరణ్‌ అబ్బవరం హీరోగా వరుస పరాజయాల్లో ఉన్నారు. `ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం`తో సక్సెస్‌ అందుకున్నారు కిరణ్‌. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. 

`సెబాస్టియన్‌ పీసీ524`, `సమ్మతమే`, `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` పరాజయం అయ్యింది. `వినరో భాగ్యము విష్ణుకథ` పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన `మీటర్‌`, `రూల్స్ రంజాన్‌` పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఆయన `దిల్‌రూబా` చిత్రంలో నటిస్తున్నారు. 

Read more: బెస్ట్ ఫ్రెండే లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన నటి స్నిగ్ద