- Home
- Entertainment
- బెస్ట్ ఫ్రెండే లవ్ ప్రపోజ్ చేశాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి స్నిగ్ద
బెస్ట్ ఫ్రెండే లవ్ ప్రపోజ్ చేశాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి స్నిగ్ద
బాయ్‌లా కనిపిస్తూ నటిగా అలరిస్తుంది స్నిగ్ద. అయితే నాలుగు పదులు దాటినా పెళ్లి చేసుకోలేదు. దీనిపై తాజాగా స్పందించింది. షాకింగ్ విషయాలను వెల్లడించింది.

నటి స్నిగ్ద.. నటిగా, సింగర్‌గా రాణించింది. నటిగా ఆమె అనేక సినిమాలు చేసి మెప్పించింది. హీరో ఫ్రెండ్ రోల్‌గానే, హీరోయిన్‌కి ఫ్రెండ్‌గానే చేసి అలరించింది. తనదైన డైలాగ్‌లతో, యాటిట్యూడ్‌తో నవ్వులు పూయించింది. అలరించింది. ఆమె నందిని రెడ్డి రూపొందించిన `అలా మొదలైంది` చిత్రంలో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ముప్పైకి పైగా సినిమాలు చేసి మెప్పించింది.
అదే సమయంలో సింగర్‌గానూ రాణించారు. ఆమె పలు సింగింగ్ షోస్‌లో పాల్గొని సింగర్‌గా నిరూపించుకుంది. ఓ వైపు నటిగా, మరోవైపు సింగర్‌గా అలరించింది. కమర్షియల్ యాడ్స్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా చేసింది. ఇలా విభిన్నమైన రంగాల్లో రాణించే ప్రయత్నం చేసింది. మెప్పించింది.
స్నిగ్ద వేషాదారణ చాలా వరకు చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఎప్పుడు అబ్బాయిలా దుస్తులు ధరిస్తుంది. చాలా వరకు షర్ట్ ప్యాంట్‌లోనే ఉంటుంది. జీన్స్ వేస్తుంది. అబ్బాయి వేషధారణలోనే ఉండేందుకు ఇష్టపడుతుంది. అందులోనే ఆమె కంఫర్ట్ వెతుక్కుంటుంది. ఫ్రెండ్స్ కూడా బాయ్స్ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో విభిన్నమైన మైండ్ సెట్‌తో సర్వైవ్ అవుతుంది.
అయితే స్నిగ్ద ఏజ్ 43ఏళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పింది. అలాగే తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ కూడా వెల్లడించింది. తనకు పెళ్లిపై నమ్మకం లేదని, పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కలగలేదని, అలాంటి సందర్భం కూడా రాలేదని తెలిపింది స్నిగ్ద. ప్రస్తుతం తాను దీక్షలో ఉంటానని, 120 రోజులు ఇలా దీక్షలోనే టైమ్ వెళ్లిపోతుందని తెలిపింది. పెళ్లి అనేది మన సోల్ పర్పస్ నుంచి పక్కకి తీసుకెళ్తుందని, అందుకే మ్యారేజ్ చేసుకోవడం లేదని చెప్పింది.
పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, వారి చుట్టూనే లైఫ్ తిరిగే బదులు, హాయిగా సంపాదించి, ఎన్నో అనాథశ్రమాలు ఉన్నాయి. వారిలో ఉన్న పిల్లలకు ఎంతో కొంత ఇస్తే వాళ్లు బాగు పడతారని భావిస్తానని తెలిపింది. ప్రస్తుతం అలాంటి సర్వీసింగే చేస్తున్నట్టు తెలిపింది స్నిగ్ద. అయితే చిన్నప్పుడు తనకు లవ్ ప్రపోజల్ వచ్చిందని, ఆ సమయంలో తాను పెద్ద రెబల్‌గా ఉండేదాన్ని అని, అతన్నికి ఇచ్చిపడేసినట్టు తెలిపింది.
పెద్దయ్యాక తన బెస్ట్ ఫ్రెండే లవ్ ప్రపోజ్ చేశాడట. మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధ పడ్డాడట. జీవితం మీద ఆశలేదా అని చెప్పినట్టు తెలిపింది. తాను నీకు, పుట్టబోయే పిల్లలకు టైమ్ ఇవ్వగలను అనిపిస్తే చేసుకుంటానని చెప్పినట్టు తెలిపింది. ఇతర పిల్లల మమ్మీ డాడీ లాగా తాను కూడా ఎందుకు లేవు అని అడిగితే సమాధానం లేదని, అలాంటి సమాధానం ఇచ్చే స్థితిలో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది.
ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్ టైమ్ ఇవ్వడం లేదని, మంచి చెడు చెప్పేవాళ్లు లేరని, అందుకే పిల్లలు రౌడీలుగా మారుతున్నారని, ఈవ్‌టీజింగ్‌లు, ఇతర చెడు పనులు చేయకుండా ఉంటారని తెలిపింది స్నిగ్ద. పెళ్లి గురించి పేరెంట్స్ కూడా అడిగారని, ఫ్రెండ్ ప్రపోజల్ విషయాన్ని కూడా అడిగినప్పుడు వాడు నాకు లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్‌గానే కావాలి అని చెప్పానని తెలిపింది. తాను ఇలానే ఉంటానని ఆమె స్పష్టం చేసింది.