నవంబర్ 20 బుధవారం రోజున తెలుగు చలన చిత్ర ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయం, అతని ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 

సురేష్ బాబు సోదరుడు, విక్టరీ వెంకటేష్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు.  ఉన్నపళంగా దగ్గుబాటి ఫ్యామిలీపై ఐటీ దాడులు జరగడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. అదే సమయంలో హీరో నాని ఇల్లు, కార్యాలయం.. హారిక అండ్ హాసిని, సితార లాంటి ప్రొడక్షన్ సంస్థలపై కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. 

ఆ హీరోతో హీరోయిన్ అంజలి ఒకే గదిలో గడిపింది.. ఆమె చెడిపోవడానికి కారణం అతడే

ఆదాయపు పన్ను విభాగానికి సంబంధించిన గత కొన్నేళ్ల లెక్కలలో తేడాలు ఉండడంతో ఐటీ అధికారులు ఇలా అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఆడిటర్లతో పలు పత్రాలని పరిశీలించారు. బుధవారం ఉదయం మొదలైన దాడులు సాయంత్రం వరకు కొనసాగాయి. ఇదిలా ఉండగా కింగ్ నాగార్జునకు చెందిన ఆస్తులపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

నాని, త్రివిక్రమ్ సన్నిహిత ప్రొడక్షన్ హౌస్ పై ఐటీ దాడులు.. టాలీవుడ్ కు వరుస షాక్ లు!

దీనిపై నాగార్జున తాజాగా క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. మీపై ఐటీ అధికారులు దాడులు జరిపారా అని కొంతమంది నా మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు. అసలు ఐటీ దాడుల గురించి వారు మాట్లాడితేనే నాకు తెలిసింది. నా కార్యాలయాలపై ఎలాంటి ఐటీ రైడ్స్ జరగలేదు అని నాగార్జున ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. 

నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కొన్ని వారాల క్రితమే విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం నాగార్జున సినిమాలతో బిజీ అవుతున్నారు. నాగార్జున చివరగా నటించిన చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రం నిరాశపరిచింది.