ఐటీ అధికారులు తెలుగు చలన చిత్ర పరిశ్రమని జల్లెడ పట్టేందుకు నిర్ణయించుకున్నారు. కొద్ది సేపటి క్రితమే బుధవారం ఉదయం ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు చెందిన పలు కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ అధికారులు మరో షాక్ ఇచ్చారు. 

టాలీవుడ్ క్రేజీ హీరో నేచురల్ స్టార్ నాని ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. నాని ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఐటీ అధికారులు వివిధ టీంలు గా విడిపోయి టాలీవుడ్ ని జల్లెడ పడుతున్నారు. 

సురేష్ బాబు, నాని నివాసాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు నేడు అకస్మాత్తుగా టాలీవుడ్ ని టార్గెట్ చేయడం హిట్ టాపిక్ గా మారింది. 

నేచురల్ స్టార్ నాని గత కొన్నేళ్లలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూ సంపాదన పరంగా అగ్ర హీరోలతో పోటీ అపడుతున్నారు. నాని నిర్మాతగా కూడా అ! అనే చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం 'హిట్' అనే మూవీని నిర్మిస్తున్నాడు. 

బ్రేకింగ్: రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు!

మరోవైపు హారిక అండ్ హాసిని సంస్థ వరుసగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాలని నిర్మించింది. ప్రస్తుతం హారిక హాసిని సంస్థ అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రాన్ని నిర్మిస్తోంది.  సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంపై కూడా ఐటీ దాడులు జరిగాయి.