మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తున్న ధోనీ హీరోయిన్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ మూవీ షూటింగ్ మహేష్ తో షూటింగ్ లో పాల్గొంటున్న కియారా

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ఇచ్చిందో తెలిసిందే. కాగా ఇదే కాంబినేషన్ లో కొన్ని రోజుల క్రితతం ప్రారంభమైన తదుపరి సినిమా కూడా షూటింగ్ పనుల్లో బిజీబిజజీగా వుంది. ఇందులో బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ మహేశ్‌ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో కైరా చేస్తున్న తొలి చిత్రమిదే.

గత కొన్ని రోజులుగా మహేష్ కొరటాల సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా మంగళవారం నుంచి కైరా సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. మహేష్ కొరటాల కాంబినేషన్ లో సూపర్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో మహేశ్‌ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను చిత్రానికి పరిశీలిస్తున్నారు. శరత్‌కుమార్‌ మహేశ్‌ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.