Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ సినిమాలో పవన్ అత్తగా ఖుష్బూ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర

పవన్ అత్త రోల్ కోసం ఖుష్బూను ఎంచుకున్న త్రివిక్రమ్

నవంబర్ 5న పవన్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం

KHUSHBU AS PAWAN AUNT IN TRIVIKRAM MOVIE

ఈ నెల 5వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లోని కొత్త సినిమా మొదలవుతోంది. ఇప్పటికే కథానాయికగా సమంతాను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఒక కీలకమైన పాత్ర కోసం ఖుష్బూను తీసుకున్నారని అంతా అననుకుంటున్నారు.

గతంలో ' అత్తారింటికి దారేది' సినిమా కోసం పవన్ అత్తగా త్రివిక్రమ్ 'నదియా'ను తీసుకున్నాడు. ఆ పాత్ర ఆమెకి ఎంతో క్రేజ్ తో పాటు అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే తరహా పాత్ర కోసం ఖుష్బూ ను ఎంపిక చేశారని అంటున్నారు. అదే నిజమైతే పవన్ అత్త పాత్రలో ఖుష్బూ ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.