నా పేరు ఖాన్... అయితే ఇప్పుడేంటి అంటున్న ఖుష్బూ

khushboo sunder reacts to khan comments
Highlights

  • ఖుష్బూ సుందర్ అసలు పేరు ఖాన్ అంటూ నెటిజన్ల కమెంట్స్
  • తన పేరును కొత్తగా కనిపెట్టిన మూర్ఖులంటూ ఘాటు వ్యాఖ్యలు
  • తనకు అమ్మానాన్నలు పెట్టిన పేరును కొత్తగా కొందరు కనిపెట్టారని సెటైర్స్

 

తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో నటించిన సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియాలో తనను విమర్శించిన వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆమె పేరు నఖాత్‌ ఖాన్‌ అని గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు రెచ్చగొట్టేలా వరుస ట్వీట్లు చేశారు. ఆమె ముస్లిం మతస్థురాలని పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి ఖుష్బూ ఘాటుగా సమాధానమిచ్చారు.

 

‘కొంతమంది నన్ను కొత్తగా కనుగొన్నారు. నా పేరు నఖాత్‌ ఖాన్‌. యురేకా... ముర్ఖులారా.. ఆ పేరు నా తల్లిదండ్రులు పెట్టింది. అవును నా పేరు ఖాన్‌.. ఇప్పుడేంటి? చాలా ఆలస్యమైంది, ఇక మేలుకోండి. మీరు 47 సంవత్సరాల వెనుక ఉన్నారు’ అంటూ ఆమె విమర్శకులకు బదులిచ్చారు.
 

ఖుష్బూ ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉంటుంటారు. సినీ, రాజకీయ, సామాజిక అంశాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు. ఆమె ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

loader