" అజ్ఞాతవాసి"లో ఖుష్బూది పవర్ ఫుల్ రోల్.. పోస్టర్ అదిరింది

" అజ్ఞాతవాసి"లో  ఖుష్బూది పవర్ ఫుల్ రోల్.. పోస్టర్ అదిరింది

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ రీట్వీట్ లో ‘అజ్ఞాతవాసి’ కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు.

 

తాజా పోస్టర్‌లో ఖుష్బూ కుర్చీలో కూర్చొని ధీరత్వాన్ని ప్రదర్శిస్తుంటే.. పవన్ ఆమె వెనుకనే నిలబడి ఉండటాన్ని బట్టి ఈ మూవీలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుస్తోంది. ఇక నిన్న విడుదల చేసిన టీజర్‌లో ఖుష్బూ‌ను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించలేదు త్రివిక్రమ్. అయితే వెనుక నుంచి సింగిల్ ఫ్రేమ్‌లో ఈమే ఖుష్బూ అన్నట్లు రివీల్ చేశారు.

 

ఇన్నేళ్లు ఇలాంటి విలువైన పాత్ర కోసం ఎదురు చూశానని.. అలాంటి పాత్రను తనకు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని ఖుష్బూ పేర్కొన్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించడం హ్యాపీగా ఫీల్ అవుతున్నానని.. పవన్ మంచి స్వభావం ఉన్న వ్యక్తి అంటూ కొనియాడారు ఖుష్బూ.

 

ఈ మూవీలో పవన్ సరసన అనుఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇక డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరిగే ఆడియో వేడుకలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

 

‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకకు ప్రత్యేకంగా విక్టరీ వెంకీ, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా హాజరు కానున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితోసహా మెగా హీరోలు అందరూ హాజరు కానున్నారని, అయితే.. ప్రస్తుతానికి అది అఫీషియల్ గా కన్ఫమ్ చేయకుండా సర్ ప్రైజ్ వుండేలా రివీల్ చేయట్లేదని తెలుస్తోంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page