అనుకున్నదే అయ్యింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తమ ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అభిమానంతో అక్కున చేర్చుకున్న ప్రేక్షకులు ఖైదీకి తిరుగులేని రికార్డులు అప్పజెప్తున్నారు. తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు ఖైదీ. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . నాన్ బాహుబలి చిత్రాల్లో శ్రీమంతుడు నెంబర్ వన్ గా నిలిచింది అయితే తాజాగా ఆ రికార్డ్ తుడిచి పెట్టుకుపోయింది .

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 జనవరి 11న రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే . కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల షేర్ ని రాబట్టి శ్రీమంతుడు రికార్డ్ ని బద్దలు కొట్టాడు చిరంజీవి . లాంగ్ రన్ లో బాహుబలి ని టచ్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . తెలుగులో ఇప్పుడు టాప్ 2 చిత్రాల్లో నెంబర్ వన్ గా బాహుబలి ఉండగా రెండో స్థానంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం స్థానం సంపాదించుకుంది .బాస్ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన చిరు 200 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు . 150 కోట్ల గ్రాస్ ని 85 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన చిరు దృష్టి ఇప్పుడు బాహుబలి పై ఉంది .