తెలుగు ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాపై కేంద్ర సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై పోరాటానికి మద్దతునిస్తూ ,విభజన చట్టం లోని హామీ లను కేంద్రం  నేరవేర్చకపోవడం పై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రకటన లో " తెలుగు వారి ప్రత్యేక హోదా హక్కు ఉద్యమానికి మద్దతు గా  గతంలో తమ నిరసన ప్రదర్శను తమిళనాడు లోని హోసూర్ నందు భారి ఎత్తున ప్రదర్శించటం జరిగిందని, ప్రపంచంలోని తెలుగు వారికి ఎక్కడ ఎ సమస్య వచ్చిన తెలుగు జాతి అంత ఒకటే అనే నినాదం నాకు కట్టుబడి తమిళనాడు తెలుగు యువశక్తి ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు.

 

దక్షిణాది  ప్రస్తుతం ఎన్టీఆర్ ,జయలలిత లాంటి నాయకులను కోల్పోవడం తో  నాయకత్వ లేమి ఏర్పడిందని దాని వలన కేంద్రం  దక్షిణాది ప్రజలతో ఆటలుఅడుకొంటునదని, ఇప్పుడు దక్షిణాది ప్రజలందరూ ఒక సంఘటిత శక్తిగా  మారి కేంద్రం నాకు బుద్ధి చెప్పేందుకు ఉద్యమించవలసిన అవసరం ఉందని,విభజించు పాలించు అనే విధానం తో గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాది వారు దక్షిణాది ప్రజలకు అన్నాయం చేయుచున్నారని,పన్నుల నిష్పత్తిలో దక్షిణాది రాష్ట్రల ఆదాయం కేంద్రం నాకు  ఎక్కువ ఉన్నప్పటికీ,అభివృద్ధి పథంలో ఈ రాష్టలు వేనుకబడి ఉన్నాయని ,స్వాతంత్రం  వచ్చి నప్పటి నుంచి కూడా దక్షిణాది నాయకులందరిని ఉత్తరాది నాయకులు ఎన్నో అవమానలకు గురిచేయటం జరిగిందని ,ఈ దేశం ఇంత ఆర్థిక పురోగతిని సాదించుటకు దక్షిణాది నాయకుడు అయ్యిన పి.వి.నరసింహారావు సంస్కరణలే కారణం అయ్యినప్పటికి..ఆయన  పరిపాలనాలో  దేశ ప్రజలకు దక్షిణాది వాడి పరిపాలన   దక్షత కు నిదర్శనం కదా...  అని ఉత్తరాది నాయకత్వం ను ఆయన కేతిరెడ్డి  ప్రశ్నించారు.

 

దక్షిణాది ప్రజలందరూ తరతరలు గా తమకు జరుగుతున్న అన్నాయలకు వ్యతిరేకంగా... ప్రాంతాలకు,పార్టీలకు ,మతాలకు అతీతంగా కేంద్రం చూపుతున్న వివక్ష పై పోరాటనికి సిద్ధం గా ఉన్నారని, దక్షిణాది కి చెందిన రజనీకాంత్ , కమలహాసన్, మమ్ముట్టి ,మోహన్ లాల్, చిరంజీవి, విశాల్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర తదితరులు దక్షిణాది పై కేంద్ర వివక్షకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమలలో పాల్గొని తమ సంఘీభావం ను తెలిపి మేము అంత ఒక్కటే అనే సంకేతం ను ఉత్తరాది వారికి ఇవ్వవలసిన అవసరం ఉంది. దక్షిణాది ప్రజల పక్షాన నిలబడవలసిన బాధ్యత మీకు ఉంది,కావున వెంటనే ఆంధ్ర ప్రాంత ప్రజల పక్షాన మీరు నిలవండి.....   

 

దక్షిణాది ప్రజలందరూ తెలుగు వారు  మన సహోదరులే అన్న భావనతో తెలుగు ప్రజల హక్కులకు విఘాతం కల్పించుచున్న కేంద్ర వైఖరి కి వేతిరేకతను తెలియచేయలని అప్పుడే దక్షిణాది సత్తా ఎమిటో,దక్షిణాది వారిని   అపహాస్యం చేసే ఉత్తరాది నాయకత్వం నాకు మన సత్తా  తెలుసుతుందని, జల్లికట్టు ఉద్యమo లాగ చరితాత్మక ఉద్యమం నాకు దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం పై ప్రజలందరూ ఉద్యమం చేయాలని , జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని ని నిర్ణయించే అధికారం దక్షిణాది ప్రజల ఓట్లు  కీలకం అవ్వాలని,మేక్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళుతున్న ప్రధాని. దక్షిణాదిపై ఎందుకు సవతి తల్లి  ప్రేమను చూపించుచున్నడో ప్రజల కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 

జై భారత్ అనే నినాదం నాకు సార్ధకత చేయాలని.జై దక్షిణ  భారత్ అనే  నినాదంతో ప్రజలు ముందుకు సాగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, ప్రాంతీయ విద్రేకలకు తావులేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమతుల్యo గా ఉండే0దుకు ప్రధానమంత్రి నాయకత్వం లోని కేంద్రప్రభుత్వం అందుకు అడుగులు వేయాలని ,అలా జరగని పక్షంలో రాబోయ్ ఎన్నికల్లో బి.జె. పి కి తగిన విధంగా బుద్ధి చైపుటకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని ,ప్రధాని వెంటనే యుద్ద ప్రాతిపదికన విభజన చట్టంలో తెలియచేసిన అన్ని అంశాలను నీరవేరిచి దక్షిణాది ప్రజల గుండెల్లో స్థానం ను పొందాలని   "కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో కేంద్రం ను డిమాండ్ చేశారు.