పవన్ ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చిత్రంలో హిరోయిన్ కీర్తి సురేష్ పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా కీర్తి లుక్ రిలీజ్ 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును నిన్న ఆయన నిరాడంబరంగా జరుపుకున్నా... పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన పవన్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ మూవీ పోస్టర్ లో టైటిల్ ప్రకటన లేక పోయినా అందులో పవన్ ని చూసుకొని అభిమానులు పండగ చేసుకున్నారు. ఆ ఆనందంలో ఉండగానే సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేసిన మ్యూజికల్ వీడియో గిఫ్ట్ ను పదేపదే చూసుకుని మురిసిపోయారు.

ఇలా పవన్ అభిమానులు పవర్ స్టార్ పుట్టినరోజును ఎంజాయ్ చేస్తుంటే పవన్ అభిమానులకు సాయంత్రం సరికి హిరోయిన్ కీర్తి సురేష్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. పవన్ తో తాను నటిస్తూ కలిసి ఉన్న ఒక స్టిల్ ను విడుదల చేసి అభిమానులకు జోష్ ను ఇచ్చింది. ఈ స్టిల్ కలర్ ఫుల్ గా ఉండటమే కాకుండా పవన్ కీర్తిల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అన్న సంకేతాన్ని ఆ స్టిల్ కలగచేస్తోంది. 

ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కీర్తి పవన్ పక్కన ఎలా ఉంటుంది అన్న సందేహాలను నివృర్తి చేసేలా ఈ స్టిల్ ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో కీర్తి షేర్ చేసిన బర్త్ డే గిఫ్ట్ తో పవన్ అభిమానుల హడావిడి మధ్య ఆనందంగా పవన్ 50వ పుట్టినరోజు గడిచింది. 

ఇక ఈమూవీకి ‘అజ్ఞాత వాసి’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి ఇలాంటి ప్రయోగాత్మక టైటిల్ ఎంత వరకు పవన్ అభిమానులకు కనెక్ట్ అవుతుంది. ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా..మళ్లీ మార్చేస్తారా అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి..