Asianet News TeluguAsianet News Telugu

‘గుడ్‌లక్‌’ కేవలం టైటిల్ లోనేనా?లేకపోతే ఇదేంటి మళ్లీ

  కీర్తి సురేష్ అంటే స్టార్ హీరోయిన్. ఆమె పేరు చెప్తే బిజినెస్ అయ్యిపోతుంది. బయ్యర్లు ముందుకొస్తారు. ఓటీటి వాళ్లు ఉత్సాహం చూపిస్తారు. టీవి ఛానెల్స్ వాళ్లు పండగ చేసుకుంటారు. అయినా సరే ఎప్పుడో పూర్తైన ఆమె సినిమా రిలీజ్ కు వెళ్ళకపోవటం ఏమిటి  

Keerthy Suresh Good Luck Sakhi release again postponed
Author
Hyderabad, First Published Nov 16, 2021, 1:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన `చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తమే కుదరటం లేదు. ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడింది కీర్తి సురేష్ మూవీ. గతేడాది నుంచి ఇప్పటికే ఒక పది సార్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, వాయిదా వెయ్యడం జరిగింది. లేటెస్ట్ గా ఇంకో డేట్ వచ్చింది. మొన్నటివరకు నవంబర్ 26 అంటూ చెప్పిన ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

“‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం,”అని అన్నారు నిర్మాత సుధీర్ చంద్ర.
 
నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘గుడ్‌లక్‌ సఖి’.   ఈ చిత్రంలో రైఫిల్‌ షూటర్‌ పాత్రలో కీర్తి, కోచ్‌ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు.  కీర్తి సురేష్ అంటే స్టార్ హీరోయిన్. ఆమె పేరు చెప్తే బిజినెస్ అయ్యిపోతుంది. బయ్యర్లు ముందుకొస్తారు. ఓటీటి వాళ్లు ఉత్సాహం చూపిస్తారు. టీవి ఛానెల్స్ వాళ్లు పండగ చేసుకుంటారు. అయినా సరే ఎప్పుడో పూర్తైన ఆమె సినిమా రిలీజ్ కు వెళ్ళకపోవటం ఏమిటి అనేది ఇప్పుడు ఆమె అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఏ సినిమా ..అసలేం సమస్య వచ్చింది 

 క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలు వెండితెరపై తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘గుడ్‌లక్‌ సఖి’. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు.  ఈ  సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కరోనా సమయంలోనే షూటింగ్ ముగించామని రిలీజ్ డేట్ సైతం  ప్రకటించారు. ఓటీటీ రిలీజ్ కు వెళ్లటం లేదన్నారు. టీజర్ వదిలాక సినిమాపై ఎక్సపెక్టేషన్స్ కూడా పెరిగాయి. కానీ రిలీజ్ మాత్రం కావటం లేదు. ఎక్కడ వచ్చింది సమస్య అంటే... ఆర్ది సమస్యలే అంటున్నారు.

Also read భర్తను నటుడుగా మార్చనున్న కాజల్... ఇదేం ట్విస్ట్

ఫైనాన్సియల్ క్రైసిస్ నుంచి బయిట పడేసేందుకు ఈ సినిమా ను దిల్ రాజు టేకోవర్  చేశాడని.. షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడంటూ వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రెజెంట్స్ అని కూడా టీజర్ లో వేసారు. దాంతో దిల్ రాజు  ఓటీటీ లేదా థియేటర్ ఏదో ఒక మీడియం ద్వారా బయిటపడుతుందని అనుకున్నారు. అది జరిగి ఆరు నెలలు గడిచినా సినిమా ప్రసక్తే రావటం లేదు. కీర్తి సురేష్ వంటి స్టార్ ఉన్నా ఈ సమస్యలేంటి అంటున్నారు. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎందుకు పెండింగ్ లో పెట్టారు, సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారా లేక బిజినెస్ కాలేదా..లేక వేరే కారణాలా అంటూ ట్రేడ్ లోడిస్కషన్ మొదలంది. 

Also read పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్

ఏదైమైనా సినిమా విడుదల విషయంలో వాయిదాలు పడటం పట్ల కీర్తి సురేష్ అభిమానులుకు బాధ కలిగిస్తోంది. అయితే ఆమె చేసిన సినిమాలు వరస  ఫ్లాఫ్ అవటమే కారణం అంటున్నారు. కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. మూడు సినిమాల్లో పెంగ్విన్ ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. ఆ తర్వాత విడుదల అయిన మిస్ ఇండియా కూడా నిరాశ పర్చింది. ఆ ఇంపాక్ట్ గుడ్ లక్ సఖిపై పడిందంటున్నారు.

ఆటల నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌గా ఎలా మారిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దీంట్లో కీర్తి ఓ గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Follow Us:
Download App:
  • android
  • ios