మళ్లీ సావిత్రిగా చేస్తుందా..?

First Published 30, Jun 2018, 3:19 PM IST
keerthi suresh to play savitri role again in ntr biopic
Highlights

'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రలో తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్

'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రలో తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్. నిజంగా తెరపై సావిత్రిని చూస్తున్నామా..? అనే భావన కలిగించింది. ఈ సినిమాతో ఆమెకు ఎనలేని గుర్తింపు లభించింది. ఒక్క హిట్టుతో స్టార్ హీరోయిన్ల లిస్టులో టాప్ కు చేరుకుంది. తనకు అంత సక్సెస్ ఇచ్చిన సావిత్రి పాత్రలో కీర్తి మరోసారి కనిపించనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

విషయంలోకి వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు  సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్, సావిత్రిల ప్రస్తావన కూడా ఉంటుంది. ఇప్పటికే ఏఎన్నార్ పాత్ర కోసం సుమంత్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ విధంగా సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

పైగా తెరపై ఈ పాత్రకు నిడివి కూడా ఎక్కువే ఉంటుందట. కాబట్టి గెస్ట్ రోల్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిరోజుల కాల్షీట్సే కావడంతో కీర్తి కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతుందని సమాచారం. అదే నిజమైతే సావిత్రి పాత్రతో రెండు సినిమాలలో నటించే అరుదైన అవకాశం దక్కిన్చుకున్నట్లే.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

loader