సావిత్రి కీర్తి సురేష్ కు కష్టాలు తెచ్చిపెట్టిందట

Keerthi suresh struggled a lot for savithri getups
Highlights

సావిత్రి కీర్తి సురేష్ కు కష్టాలు తెచ్చిపెట్టిందట

అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఊహించిన దానికంటే మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంటోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిందని ఆమె తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరనేంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. అయితే, ఈ సినిమాలో తాను ప‌డ్డ క‌ష్టాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి.

తెలుగు ప్రేక్ష‌కులు సావిత్రిని దేవ‌త‌లా ఆరాధిస్తార‌ని, అటువంటి పాత్ర‌ను తాను పోషించ‌డానికి ముందు చాలా ఆలోచించానని చెప్పింది. అయితే, డైరెక్టర్ వ‌ల్లే సావిత్రి పాత్ర‌లో న‌టించ గ‌లిగాన‌ని తెలిపింది.   తను పోషించాల్సిన పాత్ర‌ల‌కు త‌న‌కు మేక‌ప్ వేసేవార‌ని, మూడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేద‌ని చెప్పింది. ఆ మేక‌ప్‌ను తిరిగి తీసేసేందుకు మ‌ళ్లీ మూడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేద‌ని చెప్పిన కీర్తి సురేష్.. కేవ‌లం త‌న క‌ను బొమ్మ‌ల‌ను సావిత్రిలా తీర్చిదిద్దేందుకే అర‌గంట స‌మ‌యం ప‌ట్టేద‌ని చెప్పింది. మేక‌ప్ వేసే మూడు గంట‌ల పాటు నోరు తెరిచేందుకు వీలుండేది కాద‌ని చెప్పిన కీర్తి సురేష్ సెట్స్‌పైకి వెళ్ల‌గానే ఆ క‌ష్ట‌మంతా మ‌రిచిపోయి పాత్ర‌పై దృష్టి పెట్టేదానినంటూ చెప్పుకొచ్చింది.

loader