కీర్తి డబ్బింగ్ కష్టాలు... నవ్వు ఆపుకోలేరు... వీడియో వైరల్

First Published 21, May 2018, 1:01 PM IST
keerthi dubbing video for mahanati goes viral
Highlights

కీర్తి డబ్బింగ్ కష్టాలు... నవ్వు ఆపుకోలేరు... వీడియో వైరల్

సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటిలో కీర్తి మంచి మార్కులే కొట్టేసింది. ‘మహానటి’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే తెలుగు భాష నేర్చుకుని.. సావిత్రి పాత్ర చేస్తూ స్పష్టంగా డైలాగులు చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు. ‘మహానటి’ టీం. డబ్బింగ్ స్టూడియోలో కీర్తి పాట్లన్నింటినీ ఇందులో చూపించారు. ఒక్క చిన్న డైలాగ్ కోసం ఎన్ని టేకులు తీసుకుందో ఇందులో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

              

loader