Asianet News TeluguAsianet News Telugu

వర్మ చేతిలో రివాల్వర్ ఎప్పుడు పేలుతుందో?: కీరవాణి

వర్మ 'హ్యాండ్సప్' అంటే భయపడాల్సిందే

keeravani speech at officer movie pre release event

కీరవాణి కథలు భలే చెబుతారండీ బాబూ! రాజమౌళి సినిమాల్లో ఆయన పాటలు ఎంత హిట్టో... 'ఆఫీసర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్మ గురించి ఆయన చెప్పిన కథ కూడా అంతే సూప‌ర్‌హిట్‌ అండీ. కానీ, ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే బుర్రకు కాస్త పని చెప్పాల్సిందే.

చెరువులో పాములు, తేళ్లు, కప్పలు వుంటాయి. తుపాకీలో బుల్లెట్స్ వుంటాయి. కప్ప కరిస్తే పెద్ద ప్రాబ్లమ్ వుండదు. అదే పాము కాటేస్తే అంతే సంగతులు. తుపాకీలో బుల్లెట్స్ వున్నంత సేపూ ప్రమాదమే. కానీ, బుల్లెట్స్ అయిపోయాయా... లేదా... తెలుసుకోవడం ఎలా? ఈ లాజిక్‌ని వర్మ టాలెంట్‌కి లింక్ పెడుతూ కీరవాణి భలే కథ చెప్పారు. ఇంతకీ, ఆయన చెప్పిన పిట్టకథ ఏంటంటే...

"పెద్ద చెరువు నీళ్ళతో నిండి ఉన్నప్పుడు ఆ చెరువులోకి దిగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే... ఈత రాకపోతే మునిగిపోయే ప్రమాదం వుంది. తరవాత అందులోని పాములు, తేళ్ళు, కప్పలు కరుస్తాయేమోననే భయం వెంటాడుతుంది. అదే ఆ చెరువు పూర్తిగా ఎండిపోతే... మనకి ఎలాంటి భయం వేయదు. హ్యాపీగా అందులోకి దిగి నడుస్తాం. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ అనే వ్యక్తి రివాల్వర్‌తో మన ఎదురుగా నిలబడి 'హ్యాండ్సప్‌' అంటే భయపడాల్సిందే. 'శివ'తో ఆయన హ్యాండ్సప్‌ అన్నారు. బుల్లెట్‌తో కాల్చి చరిత్రను చంపేశారు. అయితే... ఒక్కోసారి ఆ రివాల్వర్‌లో బుల్లెట్స్‌ వుండవు. ఒక్కోసారి డమ్మీ బుల్లెట్స్‌ వుంటాయి. ఒక్కోసారి ఒకట్రెండు బుల్లెట్స్‌ వుండొచ్చు. వర్మ చేతిలోది ఖాళీ రివాల్వర్‌ అనుకుని, డమ్మీ బుల్లెట్స్‌ వున్నాయేమో అనుకుని భయపడకుండా వుండలేం. ఎందుకంటే... అది చెరువు కాదు. ఏమో... ఎప్పుడు బుల్లెట్స్‌ వుంటాయో? ఆయన హ్యాండ్సప్‌ అంటే చేతులు ఎత్తాల్సిందే! ఎప్పుడూ భయపడాలి. రాము చేతిలో రివాల్వర్‌ ఎప్పుడు పేలుతుందో తెలియదు కాబట్టి భయపడతాం" - ఇదీ కీరవాణి చెప్పిన కథ. 

ఆయన కథలో 'వర్మ చేతిలో రివాల్వర్' అంటే 'వర్మ తీసిన సినిమా' అనుకుంటే... బుల్లెట్స్‌ని సినిమాలో కంటెంట్ అనుకోవాలి. ఒక్కోసారి బుల్లెట్స్ లేవంటే... సినిమాలో కంటెంట్ లేదనే అర్థం కాబోలు. అదే ఒకట్రెండు బుల్లెట్స్ అంటే... ఒకట్రెండు మంచి సినిమాలు అనుకోవాలి. వర్మ ఎప్పుడు మంచి సినిమా తీస్తాడో? ఎప్పుడు చెత్త సినిమా తీశాడో? అనే అంశాన్ని కీరవాణి భలే తెలివిగా చెప్పారు కదూ! ఇదే వేదికపై నాగార్జునకు చిన్నిపాటి విన్నపమూ చేశారు. 

కీరవాణి మాట్లాడుతూ "వర్మతో 30 ఏళ్ళ అనుబంధం నాది. 'రావుగారి ఇల్లు' సినిమాకి మేము కలిసి పని చేశాం. ఆయనకు దర్శకుడిగా పరిచయమైన 'శివ'కి నా చేత సంగీతం చేయించుకోవాలని అనుకున్నారు. నాగార్జునగారు 'కొత్త అబ్బాయి కదా! తర్వాత అవకాశం ఇద్దామ'ని వర్మ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇప్పుడు నేను కొత్త అబ్బాయిని కాదండీ... పాత అబ్బాయినే. మళ్ళీ మీరిద్దరూ ఇంకో 'శివ' తీస్తే నాతో సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వండి" అన్నారు. కీరవాణి కోరిక నెరవేరుతుందో? లేదో?

Follow Us:
Download App:
  • android
  • ios