Asianet News TeluguAsianet News Telugu

బోనులో కీరవాణి... జీఎస్టీ కేసులో విచారణకు రంగం సిద్ధం

  • జీఎస్టీకి సంగీతం అందించిన కీరవాణి
  • జీఎస్టీ కేసులో కీరవాణి విచారణకు రంగం సిద్ధం
  • వర్మతోపాటు తదుపరి విచారణకు హాజరు కావాలని నోటీసులు సిద్ధం

 

keeravani also become part of gst case

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ వివాదం మరింతగా ముదురుతోంది. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో కలిసి వర్మ తీసిన ‘జీఎస్టీ’ గత కొంతకాలంగా నెట్టింట హల్ చల్ చేసింది. ఇక ఈ వివాదానికి సంబంధించి దేవి పెట్టిన కేసుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన వర్మ... వచ్చే శుక్రవారం తదుపరి విచారణకు హాజరుకావాల్సిఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు అందించేందుకు రంగం సిద్ధం చేశారు సీసీఎస్ పోలీసులు. ‘జీఎస్టీ’ వీడియోకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎమ్. కీరవాణికి నోటీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది.



జనవరి 26న నెట్‌లో విడుదలైన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ న్యూడ్ వీడియోపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వర్మ.. ఓ మహిళను పూర్తి నగ్నంగా చూపించడాన్ని నిరసిస్తూ.. పలు మహిళా సంఘాలు ధర్నాలు నిర్వహించి వర్మపై పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కాగా ఓ ప్రముఖ చానెల్స్ డిబెట్‌లో తమపై అభ్యంతర వ్యాఖ్యలుచేసి దూషించాడని సామాజిక కార్యకర్త దేవీతో పాటు మరో మహిళ ఫిర్యాదు చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారించి.. తదుపరి విచారణకు నోటీసులు అందిచిన విషయం తెలిసిందే.


 

కాగా ఈసారి విచారణకు వర్మతో పాటు సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి, ఈ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్‌‌ని పిలిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తదుపరి విచారణలో వర్మపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అరెస్ట్‌కి రంగం చేస్తున్నారనే సమాచారం అందుతోంది. కాగా ప్రస్తుతం వర్మ.. నాగార్జున హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios