సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై, తన ఫ్యాన్స్ పై, సినీ నటి పూనమ్ కౌర్‌పై కత్తి మహేష్ తీవ్రంగా మండి పడ్డారు. తనపై సెటైర్లు వేస్తున్న వారిపై ఆయన పదునైన కత్తి విసిరారు. పవన్ ఫ్యాన్స్ తోపాటు, పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు, ఏదైనా అంశంపై బహిరంగ చర్చకు వస్తారా? నేను రెడీ అంటూ కత్తి మహేష్ తన ట్విట్టర్, ఫేస్‌ బుక్ మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టారు.

 

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారు అని పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌పైనా కత్తి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ ట్వీట్‌కు కౌంటర్ ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా.. అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త అని పవన్‌ను కత్తి మహేష్ హెచ్చరించారు.

 

దీంతో పవన్ ను విమర్శిస్తున్న కత్తిపై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో, కత్తి వాట్సాప్‌కు కాల్స్ చేయడమే కాకుండా, అభ్యంతరకరమైన మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన కత్తి వారికి సవాల్ విసిరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉంటాను. మీతో ఎదురెదురుగా తేల్చుకోవడానికి సిద్ధం. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అక్కడికి రండి. మీతో తలపడటానికి నేను సిద్ధం అని సవాల్ విసిరారు.

 

సవాల్ కు తోడుగా పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాపై విరుచుకుపడ్డాడు. అజ్ఞాతవాసి ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఎక్స్ ట్రా షోలు కూడా పర్మిటెడ్. ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి అంటూ కత్తి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.

 

ఇక పవన్ మిత్రుడు త్రివిక్రమ్ ను కూడా వదల్లేదు కత్తి. త్రివిక్రమ్ సినిమాని కాపీ కొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి. టి.సిరీస్ వేసిన కేసుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యలేక. సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తేలిక సతమతం అవుతున్న నిర్మాత. చాలా బాధాకరమైన వార్త. కానీ ఏం చేద్దాం! అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే..అంటూ కత్తి తన ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కాడు.