జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై చాలాకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్‌తో ముఖాముఖి నిర్వహించాలని మహేష్ ఈ మీడియా సమావేశాన్ని తలపెట్టారు. ఈ మేరకు పవన్, పూనమ్‌కు ఆహ్వానాలు పంపారు. అయితే వారు రాకపోవడంతో మహేష్ మీడియాతో మాట్లాడారు.

 

పవన్ కళ్యాణ్‌ను విమర్శించినందుకు సోషల్ మీడియా ద్వారా స్పందించిన నటి పూనమ్ కౌర్‌ను మహేష్ టార్గెట్ చేశారు. నిన్న నీ గర్ల్ ఫ్రెండ్ కు గడ్డి పెట్టుకో అంటూ పూనమ్ నుద్దేశించి పవన్ ను విమర్శించిన కత్తి మహేష్.. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, పూనమ్ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఆమెకు ఆరు ప్రశ్నలు సంధించారు. పూనమ్ కౌర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆరు ప్రశ్నలు సందించారు.

 

‘నేను ఎవరి గురించీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మాట్లాడదలుచుకోలేదు. అది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం. పూనమ్ కౌర్ గారిని నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు నేను లేవనెత్తుతున్నవి ప్రశ్నలు మాత్రమే. నేను ఆమెపై ఏ విధమైన ఆరోపణలు చేయట్లేదు. ఈ ప్రశ్నలు ఆమెను కించపరచడానికో, న్యూనపరచడానికో అడగడంలేదు. ఈ ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానాలుంటే ఆ తరవాత చర్చికుందాం’ అంటూ ఈ కింది ఆరు ప్రశ్నలను సందించారు.

  • 1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
  • 2. తిరుమలలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజలు ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా?
  • 3. పవన్ మోసం చేశారనే బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరున్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్లులు కట్టిందెవరు?
  • 4. పవన్ కళ్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా?
  • 5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకెందుకు అంత కోపం?
  • 6. ఒక క్షుద్ర మాంత్రికుడు నర్సింగం చేసిన క్షుద్ర పూజలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌తో కలసి అక్కడ మీరేంచేశారో చెప్పగలరా?

 

ఆరు ప్రశ్నలకు మీడియా ముఖంగా పూనమ్‌ను అడుగుతున్నానని, దీనికి ఆమె సమాధానం చెబితే బాగుంటుందని మహేష్ అన్నారు. ఏ ఆధారాలు లేకుండా ఓ మహిళపై మీరు ఆరోపణలు ఎలా చేస్తారని మీడియా ప్రశ్నించడంతో.. తన వద్ద ఆధారాలున్నాయన్నారు. పూనమ్ సమాధానం చెబితే తన వద్ద ఉన్న ఆధారాలు చూపుతానని చెప్పారు.