కలర్స్ స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్ రాశాడు.. రెండోసారట

First Published 20, Nov 2017, 4:03 PM IST
kathi mahesh love letter to colors swathi
Highlights
  • కలర్స్ స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్
  • లండన్ బాబులు సినిమాలో స్వాతి మెచూర్డ్ పర్ఫామెన్స్
  • స్వాతి నటనకు ఫిదా అయి మళ్లీ లవ్ లెటర్ రాస్తున్నానంటూ రాసిన కత్తిమహేష్

బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్  మహేష్ కత్తి ప్రతి రోజు పవన్ కళ్యాణ్ పైనే కాకున్నా.. ఏదో ఒక విషయం పై స్పందిస్తూ ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తర్వాత తనకు దక్కిన పాపులారిటీని నిలబెట్టుకునేందుకు చాల వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నాడు. పవన్ అభిమానులకు మధ్య కొనసాగుతున్న మాటల వార్ అలానే ఉంది. 

 

తాజాగా కత్తి మహేష్ మరో ప్రయోగం మొదలుపెట్టాడు. 'కలర్స్ స్వాతికి మరో ప్రేమ లేఖ' అంటూ కత్తి మహేష్ ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  గతవారం స్వాతి నటించిన 'లండన్ బాబులు' మూవీ విడుదల అయిన నేపధ్యంలో ఆ సినిమా పై కత్తి మహేష్.. ఓ రివ్యూ లాంటిది రాసి దానికి ఒక వింత కలరింగ్ ఇచ్చాడు.  

 

కలర్స్ స్వాతికి ఇంతకుముందు ఒకసారి లవ్‌ లెటర్ రాసినట్లు.. దానికి ఇది సీక్వెల్ అన్నట్లు ఆ పోస్టింగ్ ను చేసాడు. 'లండన్ బాబులు’ మూవీలో నీనటన అద్భుతం అంటూ పొగిడేస్తూనే ఆమెకు ప్రపోజ్ కూడ చేసేసాడు కత్తి మహేష్.  ఆ లెటర్ లో ఏముందంటే...

 

‘డియర్ స్వాతి  ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ..."లండన్ బాబులు" చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతం’ అంటూ తన లవ్ లెటర్ ను ముగించాడు. అయితే స్వాతి కత్తి మహేష్ కామెంట్స్ పై ఇప్పటి వరకు స్పందించని నేపధ్యంలో ఈ విమర్శకుడి ప్రోపోజల్ ను స్వాతి లైట్ గా తీసుకుంది అనుకోవాలి.

loader