కత్తి బయోపిక్.. సీనియర్ డైరెక్టర్ ప్రకటన!

First Published 26, Jul 2018, 10:46 AM IST
kathi kantha rao biopic on cards
Highlights

తాజాగా సీనియర్ డైరెక్టర్ పి.సి.ఆదిత్య ఒకప్పటి అగ్ర నటుడు కత్తి వీరుడిగా పేరు పొందిన కత్తి కాంతారావు బయోపిక్ తో సినిమా చేయనున్నట్లు వెల్లడించింది. ఆయన సినీ, వ్యక్తిగత విషయాలను ప్రజలను తెలియబరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన సినిమాలు చాలా వరకు విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మరికొన్ని బయోపిక్ లు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ ల బయోపిక్ లు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఏఎన్నార్ బయోపిక్ కూడా తీయాలని ఉందని నాగచైతన్య అన్నారు కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తాజాగా సీనియర్ డైరెక్టర్ పి.సి.ఆదిత్య ఒకప్పటి అగ్ర నటుడు కత్తి వీరుడిగా పేరు పొందిన కత్తి కాంతారావు బయోపిక్ తో సినిమా చేయనున్నట్లు వెల్లడించింది. ఆయన సినీ, వ్యక్తిగత విషయాలను ప్రజలను తెలియబరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

1951లో సినీరంగ ప్రవేశం చేసిన కాంతారావు 20 ఏళ్లలో వంద సినిమాల్లో నటించి కథానాయకుడిగా వెలుగొందారు. ఆ తరువాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయన ఎదుగుదలకు కొందరు అడ్డుపడ్డారని కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నట్లు చెప్పారు. 

loader