Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ విడుదల రేపే..

  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాటమరాయుడు
  • ఫిబ్రవరి 4న కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన టీమ్
katamarayudu teaser release tomorrow

పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “కాటమరాయుడు”. ఇప్పటికే శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ సరసన గబ్బర్ సింగ్ తర్వాత మరో సారి హాట్ భామ శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మధ్య సంక్రాంతి సందర్బంగా విదులైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ తో సినిమా పై అంచనాలు భారిగా పెరిగాయి.

దీంతో పవన్ అభిమానులు ఈ చిత్రం ఫస్ట్ లుక్ టిజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టిజర్ ఎట్టకేలకు రేపు ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నార్త్ స్టార్  ఎంటర్టైన్ మెంట్ సంస్థ తమ అఫీషియల్ ట్వీట్టర్ పేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios