రాస్కో సాంబ.. కాటమరాయుడు సూపర్ హిట్ అంటున్న సెన్సార్ బోర్డ్ సభ్యుడు  

సినిమా బయటకు రాకముందే కాటమరాయుడి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

ఇక పవన్ ఫ్యాన్స్ మీసం తిప్పుకోవచ్చు. కాటమరాయుడు సూపర్ డూపర్ హిట్ అని అప్పుడే సెన్సార్ బోర్డు సభ్యుడొకరు కితాబిచ్చారు.

రేపే థియేటర్లలో కాటమరాయుడు సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో అదరగొట్టింది.

ఇప్పుడు సినిమా కూడా అదే స్థాయిలో అదరగొడుతుందని యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ తన ట్విటర్ లో ప్రకటించారు.

కాటమరాయుడి పై మొట్టమొదటి రివ్యూ తనదేనని తెలిపారు. 4/5 రేటింగ్‌ కూడా ఇచ్చేశాడు.