`కాట‌మ‌రాయుడు` చిత్రంలో `జివ్వు జివ్వు..` సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ మాట్లాడుతూ - ```కాటమరాయుడు`లో మొదటి రెండు పాటలకు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం కలిగించిన పవర్ స్టార్ పవన్కళ్యాణ్గారికి థాంక్స్. పవన్సార్తో ఇది నాకు రెండో సినిమా. `గోపాల గోపాల` సినిమాలో `భాజే భాజే...`సాంగ్ వినగానే పవన్గారు నాకు ఫోన్ చేసి అనూప్ మనం మరోసారి కలిసి పనిచేస్తున్నామని అన్నారు. అప్పుడు ఫోన్లో ఇచ్చిన మాటను `కాటమరాయుడు` సినిమాతో పూర్తి చేశారు. ఈ విషయం ద్వారా ఆయన మాట ఇస్తే పూర్తి చేస్తారని నాకు పర్సనల్గా తెలిసింది. ఆయన అందించిన సపోర్ట్కు థాంక్స్. ఈ జివ్వు జివ్వు అనే సాంగ్ను పవర్స్టార్గారి ఫ్యాన్స్ కోసం చేశాం. అందరికీ ఈ సాంగ్ కూడా నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
పాటల రచయిత వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ - ``నేను కూడా పవర్స్టార్ పవన్కళ్యాణ్గారికి పెద్ద అభిమానిని. ఈరోజు ఆయన నటించిన `కాటమరాయుడు` సినిమాలో పాట రాయడం ఎంతో ఆనందంగా ఉంది. `జివ్వు జివ్వు ..` అనే ఈ సాంగ్ అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చే మాస్ - ఫోక్ సాంగ్. ఈ అవకాశం ఇచ్చిన పవన్కళ్యాణ్గారికి, శరత్మరార్గారికి, డైరెక్టర్ డాలీగారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్గారికి థాంక్స్``అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ - `` మా ఆదిత్య మ్యూజిక్ సంస్థలో దాదాపు పవన్కళ్యాణ్గారు నటించిన దాదాపు అన్ని సినిమాల పాటలను విడుదల చేశాం. అన్నింటికి అద్భుతమైన స్పందన వచ్చాయి. అలాగే ఇప్పుడు పవర్స్టార్ లెటెస్ట్ మూవీ`కాటమరాయుడు` పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అల్రెడి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. అందులో టైటిల్ సాంగ్ `మిరా మిరా మీసం...` కు నాలుగు మిలియన్ వ్యూస్, రెండు లక్షల లైక్స్ వచ్చాయి. అలాగే సెకండ్ సాంగ్ `లాగే లాగే...`రెండు మిలియన్ వ్యూస్కు దగ్గరలో ఉంది. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా పవన్కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని వరికుప్పల యాదగిరి రాసిన మాస్ ఫోక్ సాంగ్ `జివ్వు జివ్వు ..` అనే సాంగ్ను రేడియో మిర్చిలో విడుదల చేశాం. ఈ పక్కా మాస్ మసాలా సాంగ్ ఇటు అభిమానులు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. మిగిలిన పాటలను రెండు రోజులరే ఒర పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేశాం. ఫుల్ ఆల్బమ్ను మార్చి 18న జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విడుదల చేస్తాం. ఈరోజు విడుదల చేసిన జివ్వు జివ్వు...సాంగ్ విడుదలను ఆదిత్య మ్యూజిక్ అఫిసియల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా లైవ్ అందజేశాం. దీనికి ఆడియెన్స్ నుండి, అభిమానుల మంచి స్పందన వచ్చింది. కాటమరాయుడు పాటలన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. అలాగే కాటమరాయుడు పాటలు అఫిసియల్ ఆదిత్య యూ ట్యూబ్ ఛానెల్, యాపిల్ మ్యూజిక్, ఐ ట్యూన్స్, సావన్లో అందు బాటులో ఉన్నాయి.
కాటమరాయుడు ఆడియో విడుదల చేసే అవకాశం ఇచ్చిన పవర్స్టార్ ఫవన్కళ్యాణ్గారికి, నిర్మాత శరత్ మరార్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
