అందరిపై ఆరోపణలు చేస్తూ.. ఈ పోస్ట్ లేంటి? శ్రీరెడ్డిపై హీరో కార్తి ఫైర్

Karthi opens up on Sri Reddy's allegations
Highlights

నడిగర్ సంఘానికి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కార్తి తమిళనటులపై ఆరోపాలను చేస్తోన్న శ్రీరెడ్డి గురించి మాట్లాడాల్సి వచ్చింది. 'ఈ విషయానికి సంబంధించి నడిగర్ సంఘం త్వరలోనే అధికార ప్రకటన జారీ చేయనుంది. శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు

కొన్ని నెలలుగా చిత్రపరిశ్రమలో వారు తనను అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని.. వారందరికీ వ్యతిరేకంగా కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాను అని చెబుతూ సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేసే నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.

ముందుగా మురుగదాస్ నుండి మొదలుపెట్టి లారెన్స్, శ్రీకాంత్, సుందరి సి ఇలా కొందరు తమిళ సెలబ్రిటీలపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. చెన్నైకు వెళ్లి అక్కడ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేసింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఈ విషయాన్ని  పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా నటుడు కార్తి ఈ విషయంపై స్పందించారు.

నడిగర్ సంఘానికి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కార్తి తమిళనటులపై ఆరోపాలను చేస్తోన్న శ్రీరెడ్డి గురించి మాట్లాడాల్సి వచ్చింది. 'ఈ విషయానికి సంబంధించి నడిగర్ సంఘం త్వరలోనే అధికార ప్రకటన జారీ చేయనుంది. శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు. నేను దానికి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడంలేదు. ఆమె ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ అది వదిలేసి ఇలా సోషల్ మీడియాలో అందరిపై ఆరోపణలు చేస్తున్నారు'' అంటూ వెల్లడించారు.  

loader