ఆ హీరోయిన్ బ్యాగ్ ఎంతో తెలిస్తే షాకే!

Karisma Kapoor handbag worth Rs 6 lakhs
Highlights

బ్లాక్ టీ షర్ట్, జీన్స్ లో స్టన్నింగ్ గా ఉంది కరిష్మా. ఆమె ధరించి బ్యాగ్ చూడడానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఆ బ్యాగ్ తో ఓ కారు కొనుక్కోవచ్చని తెలుస్తోంది. ఈ బ్యాగ్  ఫ్రెంచ్ హై-ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ తయారీదారి హీర్మేస్ కు చెందినదని తెలుస్తోంది

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కరీష్మా కపూర్ అప్పట్లో యువతకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికీ తన అందం ఎంతమాత్రం తగ్గలేదని చెప్పడంలో అతిసయోక్తి లేదు. దశాబ్దానికి పైగా హీరోయిన్ గా రాణించిన కరీష్మా.. ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే కొన్నేళ్ల కిందట తన భర్తతో విబేధాల కారణంగా ఆయన నుండి విడిపోయి పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతోంది.

వైవాహిక జీవితంలో ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచించని ఆమె ఇప్పుడు సినిమాల వైపు చూస్తోందని సమాచారం. ఈ క్రమంలో తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆమె కనిపించగానే కెమెరాలు క్లిక్ మనిపించారు. బ్లాక్ టీ షర్ట్, జీన్స్ లో స్టన్నింగ్ గా ఉంది కరిష్మా. ఆమె ధరించి బ్యాగ్ చూడడానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఆ బ్యాగ్ తో ఓ కారు కొనుక్కోవచ్చని తెలుస్తోంది.

ఈ బ్యాగ్  ఫ్రెంచ్ హై-ఫ్యాషన్ లగ్జరీ గూడ్స్ తయారీదారి హీర్మేస్ కు చెందినదని తెలుస్తోంది. దీని విలువ 8650 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో ఆరు లక్షల పైమాటే. దీనిబట్టి ఆమె రేంజ్ ఏంటో తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు ఆమె తండ్రి రణధీర్. 

loader