షాక్..! మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న కరీనా

Kareena says am ready to marry again
Highlights

షాక్..! మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న కరీనా

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుని త‌రువాత ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన బాలీవుడ్‌ అందాల భామ క‌రీనా క‌పూర్ మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటానంటోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో త‌న అందాలకు ఏ మాత్రం ప‌దును త‌గ్గ‌లేద‌ని ప‌లు మేగ‌జైన్‌ల‌కు ఫోటో షూట్‌ల‌కు క‌రీనా క‌పూర్ ఫోజులిచ్చిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, క‌రీనా క‌పూర్ న‌టించిన లేటెస్ట్ మూవీ వీరే ది వెడ్డింగ్ ప్ర‌చార ప‌నుల్లో బిజీ.. బిజీగా గ‌డుపుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. క‌రీనా క‌పూర్ గ‌ర్భం దాల్చ‌డంతో.. షూటింగ్ వాయిదా ప‌డింది.

అయితే, ఇటీవ‌ల ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌నలో న‌టించిన క‌రీనా క‌పూర్ ప‌లికిన డైలాగ్‌లు ప్ర‌తీ ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. అయితే, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఓ పెళ్లిలో పాల్గొన్న క‌రీనా క‌పూర్ త‌న తోటి న‌టితో.. ఈ పెళ్లి చాలా బోరింగ్‌గా ఉంది.. నీవు మాత్రం ఇలా చేసుకోకు అంటూ చెప్తుంది. క‌రీనా మాట‌లు విన్న తోటి న‌టి.. నా పెళ్లా.. ఇలానా..? నో వే అంటూ.. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతుంది. ఆ మాట‌లు విన్న క‌రీనా .. మాట్లాడుతూ.. అయితే నేను కూడా పెళ్లి చేసుకుంటానంటుంది. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది క‌దా అంలూ తోటి న‌టి అన‌డంతో.. ఒక్క సారిగా క‌రీనా సైలెంట్ అయిపోతుంది. ఇలా క‌రీనా క‌పూర్ సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అయి.. ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌రువాత కూడా. మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటాను అని అన‌డంతో.. నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వాణిజ్య ప్ర‌క‌ట‌న అయినంత మాత్రానా.. మ‌ళ్లీ పెళ్లి అంటూ ప్ర‌స్థావ‌న తేవ‌డం ఏం బాగోదంటూ పెద‌వి విరుస్తున్నారు.
 

loader