డిసెంబర్ 26న కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ ల ముద్దుల కొడుకు తైమూర్ ఆలీ ఖాన్ పుట్టాక వాళ్ల జీవితం అంతా అతనికే అంకితమైపోయింది. ఇక ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటీలైన తన తల్లిదండ్రుల మాదిరాగనే తాను కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. తన బూరె బుగ్గలతో..నీలికళ్లతో తైమూర్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా తీసిన ఓ పిక్ లో తైమూర్ గార్డెన్ లో చేమంతితో ఆడుకుంటూ కనిపించాడు. ఆ పిక్ లో తైమూర్ ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది.

 

తైమూర్ బాలీవుడ్ పోటోగ్రాఫర్ల ఫేవరెట్ గా మారిన నేపథ్యంలో కరీనా మాట్లాడుతూ... నాకు తైమూర్ ఫోటోగ్రఫర్ ఫేవరైట్ అని తెలుసుకానీ అతనో స్టార్ కిడ్ లా చూడబడటం నాకిష్టం లేదు. అతనో సాధారణ పౌరుడిలా ఎదగాలని నేను కోరుకుంటున్నా. తను చాలా సహజంగా మాత్రమే వుండాలని నేను కోరుకుంటున్నా అంది.

 

ఈ రోజుల్లో... ప్రతి ఒక్కరిపై కన్ను వుంటోంది. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ...ప్రతి ఒక్కరు తమ లైఫ్ ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది ప్రైవేట్ అని, వ్యక్తిగతం అని అనలేము. ఎందుకంటే అంతా నెట్ లోనే కనిపిస్తోంది. అంది.

 

ప్రస్థుతం కరీనా రియా కపూర్ నిర్మిస్తున్న వీర్ ది వెడ్డింగ్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీకి శషాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు సైఫ్ కూడా షెఫ్ మూవీ పనుల్లో బిజీగా వున్నాడు.