ఆ హీరోయిన్ భర్త చాలా హాట్!

kareena kapoor comments on virat kohli
Highlights

పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు

పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు అడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన వీర్ దే వెడ్డింగ్ సినిమా జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. స్వర భాస్కర్, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్ లతో కలిసి కరీనా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తనకు విరాట్ కోహ్లి అనే చాలా ఇష్టమని అతడు చాలా హాట్ గా ఫిట్ గా ఉంటాడు కాబట్టే నేను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది. కోహ్లి ఒక్కడి పేరే చెబితే అనుష్క శర్మ ఫీల్ అవుతుందని అనుకుందో ఏమో వెంటనే ఓ హాలీవుడ్ హీరో పేరు కూడా చెప్పింది. వీరిలానే తన భర్త కూడా చాలా ఫిట్ గా ఉంటాడని అతడికి క్రికెట్ బాగా వచ్చనే విషయాలను స్పష్టం చేసింది. 

దర్శకుడు శశాంక్ ఘోష్ తెరకెక్కించిన ఈ సినిమా పెళ్లి దాని కారణంగా వచ్చే గొడవల నేపధ్యంలో సాగనుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సివుంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమయింది.

loader