క‌ర‌ణ్ జోహార్ గే అనే వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి క‌ర‌ణ్ కి కొంద‌రు మ‌గ‌వాళ్ల‌తో సంబందాలు ఉన్న‌యంటువ‌స్తున్న రూమ‌ర్లు ఏకంగా షారూక్ ఖాన్ తో సంబందం ఉందంటున్న నేష‌న‌ల్ మీడీయా
ఈ నేపథ్యంలో కరణ్ సెక్సువల్ ఓరియెంటేషన్ గురించి రకరకాల రూమర్లు వ్యాప్తి చెందాయి. పెళ్లి చేసుకోకపోవడం కూడా.. ఇతడు ‘గే’ అనే ఆరోపించే వారికి అస్త్రంగా మారింది. ఈ విషయాలన్నింటి మీదా కరణ్ చాలా కూలంకషంగా స్పందించాడట. ఇతడు ఒక రచయితతో కలిసి తన బయోగ్రఫీని లిఖించాడు. త్వరలోనే అది విడుదల కాబోతోంది. అందులో.. తన సెక్సువల్ ఓరియెంటేషన్ గురించి బోలెడన్ని విషయాలు చెప్పాడట
అందుకు సంబంధించిన లీకులు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే.. కరణ్ జొహార్ తన శృంగార ప్రాధాన్యతల గురించి చెప్పి చెప్పనట్టుగా, వివరించి వివరించనట్టుగా.. వివరించాడు. ఒక కోణం నుంచి చూస్తే కరణ్ తను గే అని ఒప్పుకున్నట్టుగా ఉన్నాయి, మరోవైపు మాత్రం దాని గురించి చర్చ అనవసరం అని ఈ దర్శకుడు చెప్పినట్టుగానూ ఉంది
ముందుగా కరణ్ చెప్పిందేమిటంటే.. తన సెక్సువల్ ఓరియెంటేషన్ గురించి అందరికీ తెలుసు! అని. ఆ వెంటనే.. తను దాని గురించి మాట్లాడితే కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తారు, తను కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. అంటూ మరో బాంబు పేల్చాడు. దీని పరామర్థం ఏమిటో కరణ్ కే ఎరుక. తన దృష్టిలో సెక్స్ అనేది పూర్తి వ్యక్తిగతమైన అంశం అని కరణ్ అన్నాడు. ఇలా చెబుతూనే.. తన 26 వ యేట న్యూయార్క్ లో వర్జినిటీని పోగొట్టుకున్నాను అని కరణ్ చెప్పుకొచ్చాడు.
ఇక షారూక్ తో తనకు సంబంధముందా? అనే ప్రశ్నను చాలా సార్లు ఎదుర్కొన్నాను అని కరణ్ చెప్పాడు. ఈ ప్రశ్న అడిగిన వారిని తను తిరిగి ఒక ఎదురు ప్రశ్న వేస్తానన్నాడు. అదేమనగా… ‘మీరు మీ సోదరుడితో ఎప్పుడైనా పడుకున్నారా?’ అని తనకు షారూక్ సోదరుడి లాంటి వాడు అని.. కాబట్టి అలాంటి ప్రశ్నను తను తట్టుకోలేను అని కరణ్ వివరించాడు!
మరి తనకు షారూక్ తో ముడిపెడుతూ ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే.. తను మగవాళ్లతో పడుకునే టైపు కాదు అని సమాధానం ఇవ్వాలి కానీ, అతడు తనకు సోదరుడిలాంటి వాడు అనడం ఏమిటో కూడా కరణ్ కే తెలియాలి. ఇలాంటి సమాధానాలే.. కరణ్ ను ఇరుక్కునేలా చేస్తున్నాయి. అయితే.. ఎవరితోనూ వివాహేతర సంబంధాలు లేకపోవడం వల్లనే తనను గే అని అనుకుంటున్నారు .. అని కూడా కరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు! ఏమిటో ఇతడి గొడవ.
