ఇద్దరు కవలలకు తండ్రయిన కరణ్ జోహార్ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్న కరణ్ తల్లి ఎవరో వెల్లడించని తండ్రి కరణ్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను గురించి ఎప్పటికప్పుడు బహిరంగంగా మాట్లాడి వెల్లడించే కరణ్.. పిల్లల విషయంలో మాత్రం కాస్త దాగుడుమూతలాడాడు. కరణ్ ఫిబ్రవరిలోనే కవల పిల్లలకు తండ్రి అయినా... ఇన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాపను పొందాడు కరణ్. ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కరణ్ పేరుని బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆది వారం కరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
అయితే కరణ్ అవివాహితుడు కావటంతో తల్లి పేరును మాత్రం తెలపలేదు. శుక్రవారం (మార్చి 3) రోజు ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడు. కరణ్ తన ఆటోబయోగ్రఫీలో పిల్లలను దత్తత తీసుకుంటాను లేదంటే సరోగసి ద్వారా పిల్లలకు తండ్రిని అవుతాను అని చెప్పాడు. తాజాగా ఆ మాటలను నిజం చేస్తూ కరణ్ తండ్రి అయ్యాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కూడా ఇటీవల ఇదే బాటలో సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు.
