మంచు విష్ణు, మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `కన్నప్ప` నుంచి మరో టీజర్ విడుదలైంది. మరి అది ఎలా ఉందో చూద్దాం.
మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ `కన్నప్ప` ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటం విశేషం. కాజల్, శరత్ కుమార్ వంటి వారు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు కాగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, విష్ణు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. ఏప్రిల్ 25 రిలీజ్ కాబోతుంది.
`కన్నప్ప` టీజర్‌లో యాక్షన్ సీన్లు హైలైట్..
`కన్నప్ప` సినిమాకి సంబంధించిన టీజర్, మెయిన్ కాస్టింగ్‌కి సంబంధించిన గ్లింప్స్ లు విడుదలయ్యాయి. ఆయాపాత్రల పోస్టర్స్ కూడా వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో టీజర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా ఈ టీజర్ సాగింది.
గుడాలపై గండాలు దండెత్తుకుని వస్తున్నాయని, శత్రువులు యమకింకరులై గుడాల మీద పడబోతున్నారని లేడీ ఆర్టిస్ట్ పాత్ర ద్వారా టీజర్ ప్రారంభమైంది. యుద్ధానికి సైన్యం సిద్ధమవుతుంది. దీనికి ఎవరూ భయపడవద్దని శరత్ కుమార్ పాత్ర తన సైన్యానికి భరోసా ఇవ్వగా, ఇంతలోనే ఆవేశంగా ఎంట్రీ ఇచ్చారు మోహన్‌బాబు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్దమవుతుంది అని మోహన్‌బాబు చెప్పడంతో సినిమాపై అంచనాలు పెంచింది.
`కన్పప్ప` ీజర్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ మంచు విష్ణు
దీంతో యుద్ధరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఆయన యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నారు. ప్రత్యర్థి సైన్యంపై బాణాల వర్షం కురిపిస్తున్నారు. వాళ్లు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం అంటాడు. ఈ క్రమంలో ఇరువైపు యుద్ధ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి.
అనంతరం మంచు విష్ణు తన సైన్యాన్ని ఉద్దేశించి ఆపద వచ్చినప్పుడు వీరుల తలలు కోరుకునే ఈ రాయి అని నిలదీస్తాడు. ఇంతలో శివుడిగా అక్షయ్ కుమార్, సీతగా కాజల్ పాత్రలు, రుద్రగా ప్రభాస్, అలాగే మోహన్‌లాల్ పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అని కాజల్ అక్షయ్‌ని ప్రశ్నించగా, ఆయన నవ్వుతో ఓ చూపు చూస్తాడు.
`కన్పప్ప` టీజర్ ఎండింగ్‌లో ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్
చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన చూపి గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ఓవరాల్‌గా టీజర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అదేసమయంలో కొంత సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. కన్నప్ప యుద్ధం ఎవరిపైనా? ఆయనకు ప్రభాస్, మోహన్‌లాల్ పాత్రలు ఎలా హెల్ప్ చేస్తాయి? నాస్తికుడు శివుడి భక్తుడు ఎలా అయ్యాడు? అనేది ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది.
కానీ మ్యూజిక్ విషయంలో అసంతృప్తి కనిపిస్తుంది. ఓ వారియర్స్ మూవీస్‌కి, మైథలాజికల్ చిత్రాలకు ఉండాల్సిన ఆర్‌ఆర్ ఇందులో లోపించింది. దీంతో టీజర్ డల్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఈ విషయంలో మేకర్స్ కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్‌గా అయితే కొన్ని సస్పెన్స్ అంశాలతో, మరికొన్ని యాక్షన్ సీన్స్ తో, చివర్లో ప్రభాస్ ఎంట్రీతో ఆకట్టుకుంది `కన్నప్ప` టీజర్.