- Home
- Entertainment
- నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి ఝలక్, `రామాయణ్`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్
నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి ఝలక్, `రామాయణ్`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్
ఇటీవల `అమరన్`, `తండేల్` చిత్రాలతో విజయాలు అందుకున్న సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ్` మూవీ చేస్తుంది. దీనికి ఆమె పారితోషికం లెక్కలు షాకిస్తున్నాయి.

sai Pallavi nayanthara rashmika Anushka trisha remuneration
హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార, రష్మిక మందన్నా, అనుష్క శెట్టిలతోపాటు త్రిష కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరికి పెద్ద షాకిస్తుంది లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి. ఆమె లేటెస్ట్ పారితోషికం తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. సడెన్‌గా టాప్‌లోకి దూసుకొచ్చి అందరికి ఝలక్ ఇస్తుంది. మరి ఆ కథేంటో చూద్దాం.
nayanthara
ప్రస్తుతం పారితోషికంలో నయనతార టాప్‌లో ఉన్నారు. ఆమె ఒక్కో సినిమాకి పది కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న ఆమె చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తుంది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తుంది. హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి. అదే సమయంలో భారీ సినిమాల్లో స్టార్ హీరోల సరసన బలమైన పాత్రలతోమెప్పిస్తుంది. అందుకే ఆమె భారీ పారితోషికం ఇస్తున్నారు.
Rashmika Mandanna
ఇప్పుడు ఇండియా నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. ఆమె `పుష్ప 2` సినిమాకి పది కోట్ల వరకు పారితోషికం అందుకుందట. కానీ `ఛావా` మూవీకి మాత్రం ఐదుకోట్లే తీసుకుందని సమాచారం. కానీ ఈ సినిమా కూడా ఇప్పుడు భారీ విజయాన్ని సాధించింది. ఐదు వందల కోట్ల దిశగా వెళ్తుంది. త్వరలోనే తెలుగులో కూడా రాబోతుంది. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
anushka shetty
ఈ జాబితాలో స్వీటి అనుష్క శెట్టి కూడా ఉంది. ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న `ఘాటి` మూవీకి అనుష్క రూ.ఏడు నుంచి 10కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని తెలుస్తుంది.
trisha
త్రిష ఇప్పుడు సౌత్‌లో బిజీగా ఉంది. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. విజయ్, అజిత్, చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ తో ఆమె జోడీ కడుతుంది. ఆమె కూడా గట్టిగానే తీసుకుంటుందట. ఒక్కో మూవీకి సుమారు రూ.10కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.
Sai Pallavi
ఇక వీరందరికి ఊహించని షాక్ ఇస్తుంది సాయిపల్లవి. ఆమె పారితోషికాన్ని సడెన్‌గా డబుల్, త్రిబుల్ చేసింది. `తండేల్` మూవీకి ఐదు కోట్ల వరకు తీసుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ్` మూవీలో నటిస్తుంది.
ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడీగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతుంది. యష్ రావణుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకి గానూ సాయిపల్లవి ఏకంగా రూ.15కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. అయితే ఇది రెండు పార్ట్ లుగా వస్తుందని సమాచారం.