- Home
- Entertainment
- చిరంజీవి ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో, బాలకృష్ణ రిక్వస్ట్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా
చిరంజీవి ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో, బాలకృష్ణ రిక్వస్ట్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లతో నటించే అవకాశాన్ని ఓ స్టార్ హీరో కోల్పోయారు. ఆ హీరో ఎవరు ? ఎందుకు ఆ సినిమాల్లో అవకాశం కోల్పోయారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలకు ధీటుగా
రాజశేఖర్ టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. ఇటీవల రాజశేఖర్ తన సినిమాల వేగం తగ్గించారు. ప్రస్తుతం రాజశేఖర్ అప్పుడప్పుడూ మాత్రమే సినిమాల్లో మెరుస్తున్నారు. రాజశేఖర్ గతంలో చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలకు ధీటుగా విజయాలు అందుకున్నారు.
చిరంజీవి స్నేహితుడిగా
ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ..చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో నేను చిరంజీవి, బాలకృష్ణ లతో కలసి నటించాలని అనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. చిరంజీవి గారు స్నేహం కోసం అనే సినిమా చేస్తున్నప్పుడు ఆయన స్నేహితుడిగా నేను నటిస్తాను అని చెప్పాను. కానీ చిరంజీవి గారు వద్దని అన్నారు.
బాలకృష్ణ స్వయంగా రిక్వస్ట్ చేశారు
వయసులో నాకంటే చాలా చిన్న వాడివి. కాబట్టి ఆ పాత్ర నీకు సెట్ కాకపోవచ్చు అని అన్నారు. ఆ తర్వాత ఆ పాత్రలో విజయ్ కుమార్ నటించారు. అదే విధంగా బాలకృష్ణ జై సింహా చిత్రంలో విలన్ గా ముందుగా నన్నే అడిగారు. బాలకృష్ణ స్వయంగా రిక్వస్ట్ చేశారు. బ్రదర్ యాక్షన్ సీన్స్ కూడా ఇద్దరం సమానంగా ఉండేలా చేసుకుందాం. మీరు నటించండి అని అడిగారు.
ఆ మూవీ చాలా గొప్పగా ఉండాలని
కానీ బాలకృష్ణ, నేను కలిసి నటిస్తే ఆ మూవీ చాలా గొప్పగా ఉండాలని నా ఫీలింగ్. కాబట్టి బాలయ్య తో కలసి నటిస్తే ఇంకా మంచి సినిమా చేస్తాను. అందుకే జై సింహా చిత్రానికి ఒప్పుకోలేదు అని రాజశేఖర్ తెలిపారు.
శర్వానంద్ బైకర్ సినిమా
ప్రస్తుతం రాజశేఖర్ శర్వానంద్ బైకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజశేఖర్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, శేఖర్ లాంటి చిత్రాల్లో నటించారు.

