అటవీ కంగారూల గుంపు యాత్రికులపై దాడులకు పాల్పడుతున్నాయి. అయితే, కంగారూలు దాడికి పాల్పడటానికి కారణం తెలిస్తే మాత్రం షాక్‌కు గురి కావాల్సిందే. క్యారెట్లు, మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ ఫాస్‌ఫుడ్స్‌కు అలవాటు పడిన కంగారూలు వాటి కోసమే దాడులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.యాత్రికులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారూలకు పెడుతూ సెల్ఫీలు దిగటం మోర్రి సెట్‌ పార్కులో మామూలే. అయితే, కంగారూలకు ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడం ఒక వ్యసనంగా మారింది. పర్యాటకులు ఎక్కువగా రాని సమయాల్లో ఆహారం కోసం అవి దాడులకు పాల్పడుతున్నాయి.
ఈ దాడుల్లో తీవ్రగా గాయపడిన ఓ మహిళకు 17 కుట్లు పడ్డాయి. ఫాస్ట్‌పుడ్స్‌ను తీసుకోవడం వల్ల కంగారూల ఆరోగ్యం వేగంగా దెబ్బతింటుంది. వాటి జీర్ణవ్యవస్థకు సరిపడని ఆహారం కావడమే ఇందుకు కారణం. క్యారెట్లను కంగారూలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి అధిక కోపాన్ని ప్రదర్శిస్తాయని నిపుణులు తెలిపారు.