‘క్రిష్‌ 3’ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డ కంగనా, హృతిక్ మరోసారి మీడియా ఎదుట విరుచుకు పడ్డ కంగనా నలుగిరిలో నన్ను అవమానించాడన్న కంగనా రనౌత్

హృతిక్‌రోషన్‌, కంగనా రనౌత్‌ వివాదం.. మరోసారి తెరపైకి వచ్చింది. మీడియా ఎదుట మరోసారి కంగనా హృతిక్ పై విరుచుకుపడింది. పరస్పర విమర్శలతో గతేడాది వీరి వ్యవహారం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

Scroll to load tweet…

‘క్రిష్‌ 3’ సినిమాలో కంగనా, హృతిక్ కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో కంగనా హృతిక్‌ను ‘సిల్లీ ఎక్స్‌’ అని సంబోధించడం వివాదాస్పమైంది. అప్పటి నుంచి కంగనా.. తనకు మెయిల్స్‌ పంపుతోందని హృతిక్‌ ఆరోపించగా.. అవన్నీ అబద్ధాలేనని పేర్కొంటూ కంగనా నోటీసులు పంపింది. అయితే ఈ వివాదం సద్దుమణిగి కొన్ని నెలలు గడుస్తున్నా.. హృతిక్‌ తనని అవమానించాడని అందుకు అతను క్షమాపణ చెప్పాలని కంగనా తాజాగా డిమాండ్‌ చేసింది.

ఇటీవల కంగనా.. తాను నటించిన ‘సిమ్రన్‌’ చిత్ర ప్రచార కార్యక్రమం నిమిత్తం ‘ఆప్‌ కా అదాలత్‌’ అనే టీవీ షోలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో కంగనా హృతిక్‌ గురించి మాట్లాడుతూ.. సద్దుమణిగిన వివాదానికి మళ్లీ తెరలేపింది. ‘అతన్ని ఇక్కడికే పిలిచి ప్రశ్నించండి. నలుగురిలో నన్ను అవమానించాడు. తట్టుకోలేకపోయాను. రాత్రిళ్లు ఎంతో ఏడ్చేదాన్ని. ఇందుకు హృతిక్‌ నాకు క్షమాపణ చెప్పాలి.’ అని తీవ్ర ఉద్వేగానికి లోనైంది.

హృతిక్ కి తన మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ తెలుసని.. వాటి ద్వారా నీచమైన పనులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. తాను మౌనంగా ఉండటంతో తండ్రికొడుకులు మరింతగా రెచ్చిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.