Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi: నిజం చెప్పొద్దంటూ బ్రతిమాలుకుంటున్న కనకం.. కావ్య జీవితంలో నిప్పులు పోస్తానంటున్న రాజ్!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటి ఇస్తుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

kanakam request to aparna about kavya in todays brahmamudi serial gnr
Author
First Published Mar 27, 2023, 12:49 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో మా అక్కని చూడడానికి వచ్చాను అంటుంది అప్పు. ఒక్కదానివే వచ్చి ఇద్దరూ బయటికి వెళ్తారా అంటాడు కళ్యాణ్. అదేంటి అంటుంది అప్పు. జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్. ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలి అంటుంది అప్పు. కోపం తగ్గే వరకు పెద్దవాళ్లు అలాగే ఉంటారు అంటాడు కళ్యాణ్. మా అక్క సంతోషంగా ఉంటే అంతే చాలు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు.

మరోవైపు మంచినీళ్ల కోసం వంట గదిలోకి వచ్చిన కావ్యని ఆపి నీళ్లు కావాలంటే సరాసరి కిచెన్ లోకి వచ్చేయటమేనా అంటూ కేకలు వేస్తుంది అపర్ణ. పనివాళ్ళు మీకు ఉన్నారు కానీ నాకు లేరు నా పనులు నేనే చేసుకోవాలి అంటుంది కావ్య. ఎవరు పడితే వాళ్ళు వంటగదిలోకి రావడానికి వీల్లేదు అంటూ శాంతని పిలిచి కావ్యకి మంచినీళ్లు ఇప్పిస్తుంది. నిజానికి మంచినీళ్లు తాగాలని లేదు.

కానీ జరిగిన అవమానాన్ని దిగమింగాలి కదా అందుకే అవసరమనిపించి మంచినీళ్లు తీసుకువెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు నువ్వు దున్నపోతువా ఎంతమంది తిట్టినా పట్టించుకోవా అంటూ తల్లిని మందలిస్తుంది అప్పు. ఇప్పుడు ఏమైంది అంటుంది కనకం. కోటీశ్వరుల కోడలు అయిన కావ్యక్క ఇక్కడికి ఎప్పుడైనా వస్తదా అని అడుగుతుంది అప్పు. ఒక్కసారిగా కంగారుపడిన కనకం వస్తుంది కానీ కొత్త పెళ్లికూతురు కదా అంటూ నసుకుతుంది.

నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అబద్ధాలు తింటున్నావా.. కావ్య అక్కకి వాళ్ళ అత్తగారు పెట్టిన కండిషన్ గురించి నాకు తెలుసు. నువ్వు చేసిన పని వల్ల కావ్య అక్క దూరమైపోయింది అంటుంది అప్పు. గట్టిగా మాట్లాడకు మీ నాన్న వింటే తట్టుకోలేరు అంటుంది కనకం. ఒక్కసారి నిజం చెప్పేస్తే పోతుంది కదా రోజుకు ఒక అబద్ధం చెప్పడం ఎందుకు అంటుంది అప్పు. నేను మొండి దాన్ని తట్టుకుంటాను కానీ మీ నాన్న తట్టుకోలేరు.

దయచేసి మీ నాన్నగారికి చెప్పొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కనకం. మరోవైపు రాజ్ వాళ్ళ శోభనంకి ముహూర్తం పెట్టిస్తుంది చిట్టి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. రాజ్ కి పెళ్లిలో అన్యాయం జరిగింది పెళ్లికూతురు మీద రాజ్ కి మనసు లేదు. ఇప్పుడు శోభనం అంటే వాడు మానసికంగా సిద్ధం కావాలి కదా, నేను కూడా కోడలుగా తనని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అంటుంది అపర్ణ. నీ అభిప్రాయాన్ని వాడి మీద ఎందుకు రుద్దుతున్నావు.

నీకు కోడలు వద్దు, వాడికి భార్య వద్దు అంటే ఈ పెళ్లిని రద్దు చేయలేం కదా అంటుంది చిట్టి. రాజ్ ఇంకా ఈ పెళ్లి వలన జరిగిన అవమానాన్నించి కోల్పోలేదు అంటుంది అపర్ణ. నేను కూడా ఆఫీసుకు వెళ్లి రెండు వారాలు అయిపోయింది అంటాడు రాజ్. పర్వాలేదు మీ తాతయ్య మీ బాబాయి చూసుకుంటారు అంటాడు సీతారామయ్య. మీ మనవడి ఇష్టాలను కూడా పట్టించుకోవాలి కదా అంటుంది అపర్ణ. కాదు అనుకోవడానికి అమ్మాయి దగ్గర అణకువ పద్ధతి అన్నీ ఉన్నాయి.

మీరు కోడలుగా తనని ఒప్పుకొని తీరాలి లేదంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్లే అంటుంది చిట్టి. ఈ కార్యక్రమం జరిగి తీరుతుంది అంటూ ఆర్డర్ వేసి వెళ్లిపోతారు సీతారామయ్య దంపతులు. మరోవైపు కావ్య నామీద చెడుగా చెప్తుందా, ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం కోసం నన్ను బ్యాడ్ చేస్తుందా ఇప్పుడే నీకు బుద్ధి చెప్తాను అనుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తుంది స్వప్న.

ఆమె దగ్గర ఫోన్ లాక్కొని ఏం చేస్తున్నావు అంటాడు రాహుల్. మా చెల్లికి ఫోన్ చేస్తున్నాను. తను నన్ను అందరి ముందు బ్యాడ్ చేస్తుందా, ఫోన్ చేసి దాన్ని చడమడ తిడితేనే కానీ నా ఆవేశం చల్లారదు అంటుంది స్వప్న. ఇప్పుడు ఫోన్ చేస్తే దొరికిపోతావు తను ఎంత ప్లాన్ గా మనల్ని ఇరికించిందో మనం కూడా అలాగే చేద్దాం అంటాడు రాహుల్. మరోవైపు అప్పు, కళ్యాణ్ కి ఫోన్ చేసి మా అక్క ఏం చేస్తుంది ఎలా ఉంది అని అడుగుతుంది.

నీకు తెలీదు కదా అంటూ మెలికలు తిరిగిపోతుంటాడు కళ్యాణ్. అంతలో ఫోన్ కనకం లాక్కొని కళ్యాణ్ చెప్పింది అర్థం చేసుకుంటుంది. శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారా అదే జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు శుభవార్త చెప్పావు అంటుంది కనకం. పొరపాటున కూడా మీరు ఇటువైపు రాకండి వస్తే మళ్లీ గొడవలు జరుగుతాయి అంటూ ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్.

మరోవైపు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కటం అంతమంది ముందు శోభనం గురించి ఎలా మాట్లాడుతాను అని ఆలోచనలో పడుతుంది కావ్య. అంతలోనే చిట్టి వచ్చి పూలు పళ్ళు అన్ని తెప్పిస్తుంది. అమ్మమ్మ గారు ఆడపిల్ల అభిప్రాయానికి విలువ లేదా అంటుంది కావ్య. విలువ ఉంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఈ తంతు  జరిపిస్తున్నాము అంటుంది చిట్టి.

రాజ్ గారు నన్ను భార్యగా ఒప్పుకోలేదు. ఈ పెళ్లిలో ఆయనకి అన్యాయం జరిగింది. నా మనసుకు కూడా గాయమైంది కొంచెం ఆలోచించండి అంటుంది కావ్య. ఆలోచించే కొద్దీ పంతాలు పట్టింపులు పెరిగిపోతాయి. మీ మధ్యన ఉన్న దూరాలు తగ్గాలంటే నువ్వు సన్నద్ధంగా ఉండాలి అంటుంది చిట్టి. ఆడపిల్ల జీవితంలోని ఇలాంటి రోజు ఒకటి వస్తుంది కానీ ఈ పెళ్లి వేరు.

పెళ్లి అయితే బలవంతంగా చేయించగలరు గాని కాపురాన్ని బలవంతంగా చేయించలేరు కదా శోభనం గదికి రానిచ్చిన వారే అయితే నన్ను ఈ గదిలో ఎందుకు ఉండనిస్తారు అంటుంది కావ్య. నువ్వు దూరం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పుడు దగ్గరవుతారు. మంచో చెడో ఇకనుంచి మీ ఇల్లు ఇదే. శోభనం సుఖం కోసం కాదు స్థిరత్వం కోసం అత్తగారి ఇంట్లో అస్తిత్వం కోసం.

బతుకు పండించుకునే వేళ కలతలని మర్చిపోవాలి. ఈ తంతు పెళ్లికూతురుని ఇల్లాలిని చేస్తుంది. ఈ కలతలు అన్నీ పక్కన పెట్టు అర్థం చేసుకొని త్వరగా రెడీ అవ్వు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిట్టి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ మీ పెద్దరికానికి తలవంచుతున్నాను ఆ తర్వాత భారం అంతా భగవంతుడిదే అనుకుంటుంది కావ్య.

తరువాయి భాగంలో రాజ్ చేత బలవంతంగా డ్రింక్ చేయిపిస్తాడు రాహుల్. ఈ కొత్త అలవాటు ఏంటి అని రాజ్ అంటున్నా వినిపించుకోడు. ఈ కావ్యయే స్వప్న ని వెళ్ళిపోయేలాగా చేసి ఉంటుంది అంటూ కావ్య మీద లేనిపోనివి చెప్తాడు. కావ్య గది దగ్గరికి వచ్చిన రాజ్ ని ఈ టైం లో ఎందుకు వచ్చారు అని అడుగుతుంది కావ్య. నువ్వు నా జీవితంలో నిప్పులు పోసావు కదా అందుకే నేను నీ జీవితంలో నిప్పులు పోస్తాను అంటాడు రాజ్.

Follow Us:
Download App:
  • android
  • ios