బిగ్ బాస్ 2 హోస్ట్ మిడిల్ డ్రాప్..?

kamal hassan to drop bigg boss as a host
Highlights

కొత్త హోస్ట్ రాబోతున్నాడా..?

ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ మొదటి సీజన్ బాగా ఆకట్టుకుంది. అయితే సెకండ్ సీజన్ పై మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ పెదవి విరుస్తున్నారు. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేశాడు. ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది అంటే అది కచ్చితంగా తారక్ వల్లే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు నాని సెకండ్ సీజన్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ సీజన్ అనుకున్నంత సక్సెస్ అవలేదని అంటున్నారు.

ఇక తెలుగుతో పాటుగా తమిళంలో కూడా మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. కోలీవుడ్ బిగ్ బాస్ కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నాడు. మొదటి సీజన్ సీరియస్ హోస్టింగ్ తో మంచి రేటిగ్స్ వచ్చేలా చేశాడు కమల్ హాసన్. తమిళంలో సెకండ్ సీజన్ కాస్త నిరాశపరుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఈ షోలో లిప్ లాక్స్ లాంటివి కాస్త అసభ్యకరంగా ఉన్నాయి.

అంతేకాదు ఇదవరకు కమల్ హాసన్ ఒక హీరో మాత్రమే కాని ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధినేత. కాబట్టి ఆయన మీద చాలా ఫోకస్ ఉంటుంది. అందుకే ఈ గోలంతా ఎందుకు అని బిగ్ బాస్-2 హోస్ట్ గా మిడిల్ డ్రాప్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట కమల్ హాసన్.

loader