శ్రుతిహాసన్ కారణంగా కమల్ కు చీవాట్లు!

Kamal Haasan trolled over Shruti's comments on caste
Highlights

కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 'మక్కల్ నీధి మయ్యమ్' అనే పార్టీను స్థాపించి రాజకీయంగా బిజీగా గడుపుతున్నారు

కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 'మక్కల్ నీధి మయ్యమ్' అనే పార్టీను స్థాపించి రాజకీయంగా బిజీగా గడుపుతున్నారు. అయితే గత వారంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కమల్.. నా కూతుళ్లను స్కూల్ లో చేర్పించిన సమయంలో వారి కులం, మతం గురించి రాయాల్సిన చోట నేను ఖాళీగా వదిలేశానని చెబుతూ కుల, మత రహిత సమాజం కోసం పాటు పడాలని అన్నారు.

కేరళ ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ ట్వీట్ చదివిన నెటిజన్లు కొన్నేళ్ల క్రితం శ్రుతిహాసన్ కులంపై చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఓ చాట్ షోలో పాల్గొన్న శ్రుతిహాసన్ సదరు వ్యాఖ్యతతో 'నువ్వు అయ్యంగార్.. నేను అయ్యంగార్, ఇద్దరం సృజనశీలురం.. మనల్ని ఎవరూ పెళ్లాడే ఛాన్స్ లేదు' అని అన్నారు. ఈ వీడియోను బయట పెట్టిన నెటిజన్లు స్కూల్ అప్లికేషన్ లో కాదు ముందు మీ ఇంట్లో సంస్కరణలు మొదలుపెట్టండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

కుల నిర్మూలనకు అంబేద్కర్ ప్రచురించిన పుస్తకాలు చదవండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే లేదు.. అతడి వ్యాఖ్యలను సినిమాలకు లింక్ చేస్తూ.. సినిమా టైటిల్స్ లో కులాల పేర్లు చేర్చడానికి ఇబ్బంది పడని కమల్ రాజకీయంగా మాత్రం కులాలకు అతీతుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా 'శభాష్ నాయుడు' సినిమా పేరుని ప్రస్తావిస్తున్నారు. 
 

loader