నయనతార కోసం రిస్క్ చేశాడు.. చిక్కుల్లో పడ్డాడు!

kalyana vayasu song copied from english album don't lie
Highlights

నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు దిలీప్ కుమార్ 'కోలమావు కోకిల' 

నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు దిలీప్ కుమార్ 'కోలమావు కోకిల' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన 'కళ్యాణ వయసు' అనే పాటను రిలీజ్ చేశారు.

ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 5 మిలియ వ్యూస్ ను దక్కించుకుంది. అయితే ఈ పాట కంపోజ్ చేసిన అనిరుద్ ని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ ట్యూన్ ను అనిరుద్ కాపీ చేశాడనే మాటలు వినిపిస్తున్నాయి.

సన్నన్ ఆల్బమ్ నుండి వచ్చిన 'డోంట్ లై' అనే సాంగ్ ట్యూన్ ఆధారంగా ఈ పాటను కంపోజ్ చేశారనే విమర్శలను ఎదుర్కుంటున్నాడు అనిరుద్. కొందరు నెటిజన్లు.. సాంగ్ చాలా బావుంది ఒరిజినల్ ఇంకా బావుంటుంది అంటూ అనిరుద్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 

 

 

loader