Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ నన్ను,ఆర్టిస్టులను టార్చర్ పెట్టాడు

  • నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే మూవీ ఈ నెల 23న థియేటర్లలోకి వస్తోంది
  • ఈ సందర్భంగా మూవీ రిలీజ్ కి రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్ సుదీర్ఘంగా మాట్లాడాడు
Kalyan Ram Speech at MLA Pre Release Event

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే మూవీ ఈ నెల 23న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ కి రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కళ్యాణ్ రామ్ సుదీర్ఘంగా మాట్లాడాడు. ప్రతీసారి సెకన్లలోనో.. 2-3 నిమిషాల్లోనో ముగిసిపోయే కళ్యాణ్ రామ్ మాటలు.. ఈ సారి ఏకంగా 15 నిమిషాల పాటు సాగాయంటే.. ఈ మూవీపై కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ అర్ధమవుతుంది.

'నేను బైట ప్రొడ్యూసర్లకు చేసిన సినిమాలలో కథను నమ్మే నిర్మాతలు వీరే కనిపించారు. హీరో ఓకే అన్నాక కూడా చిన్న మార్పులను కూడా వదిలిపెట్టలేదు. మార్చుదాం అని చెప్పారు. వీళ్లు పెద్ద నిర్మాతలు అవుతారు. నిర్మాతగా నాకు దగ్గరగా వీరు ఉన్నారు' అన్నాడు కళ్యాణ్ రామ్. 'సహజంగా ఓ గంటలోపు అందరూ కథ చెప్పేస్తారు. మొదటగా పటాస్ కు రెండు గంటల కథ విన్నాను. ఆ తర్వాత దర్శకుడు ఉపేంద్ర మాధవ్ 2 గంటల 20 నిమిషాల పాటు కథ చెప్పి.. దాన్ని అప్పుడే నా కళ్లకు కట్టినట్లు చెప్పాడు. ఇప్పుడు సినిమా ట్రైలర్ కు ఇంతటి రెస్పాన్స్ వస్తోందంటే.. అందుకు కారణం దర్శకుడు పెట్టిన టార్చర్. ఇలాంటి దర్శకుడితో పని చేయడం నాకు సంతోషంగా ఉంది. కచ్చితంగా ఇతను పెద్ద దర్శకుడు అవుతాడు. అంతలా ఆర్టిస్టులను టార్చర్ పెట్టినా.. దాని రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది' అన్నాడు కళ్యాణ్ రామ్.

'సహజంగా కొత్త దర్శకుడితో పని చేయడం అంటే.. వాళ్లు అంతగా కంట్రోల్ చేసుకోరు. వారిని ఫోటోగ్రాఫర్ కంట్రోల్ చేస్తాడు. సెట్స్ లో దర్శకుడు- డీఓపీ భార్యాభర్తలుగా ఉంటారని చెబుతూ ఉంటాను. ఆఖరికి ట్రాక్ వేసుకోవడం.. కెమేరా మోసుకోవడం వంటివి కూడా డీఓపీ ప్రసాద్ చేసేస్తుంటాడు. అంతటి సింపుల్ మనిషి ప్రసాద్. నాకు రామజోగయ్య శాస్త్రి మంచి పాటలు ఇఛ్చారు. యుద్ధం యుద్ధం అంటూ సాగే పాట సినిమాను మరో స్థాయికి తీసుకువెళుతుంది' అంటూ సినిమా టెక్నికల్ టీం గురించి వివరించాడు ఎమ్మెల్యే హీరో.

Follow Us:
Download App:
  • android
  • ios